బాహుబ‌లిని మించిన ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్‌

ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ సినిమా అంటేనే ఇండ‌స్ట్రీలో ఎంత హైప్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు రెండూ సూప‌ర్ హిట్ అయ్యాయి.

ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి వీరి కాంబోలో తెర‌కెక్కుతోన్న సినిమాపై టాలీవుడ్ సినీజనాల‌తో పాటు ఇండ‌స్ట్రీ ట్రేడ్ వ‌ర్గాల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఏపీ, తెలంగాణ వ‌ర‌కు అప్పుడే కంప్లీట్ అయిన‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విష‌యంలో తెలుగు సినిమా ఘ‌న‌త‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిన బాహుబ‌లి సినిమా ప్రి రిలీజ్ బిజినెస్‌నే క్రాస్ చేసేసింది.ఇది చాలా షాకింగ్‌గా ఉన్నా నిజ‌మే.

ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ సినిమాకు ఏపీ+తెలంగాణ‌ నుంచే థియేట్రికల్ రైట్స్ రూపంలో 94 కోట్లు స‌మ‌కూరాయ‌ట‌.ఇది బాహుబ‌లి 1 ప్రి రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ కాగా బాహుబ‌లి 2 కంటే త‌క్కువ‌.బాహుబ‌లి 2 రూ.130 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేస్తే, రెండో స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ మూవీ 94 కోట్ల బిజినెస్ చేసింది.ఈ లెక్క‌న ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ మూవీ స‌గం కూడా షూటింగ్ కంప్లీట్ కాకుండానే ఈ రేంజ్‌లో బిజినెస్ చేసి అంద‌రి మైండ్ బ్లాక్ చేస్తోంది.బాహుబలి ది బిగినింగ్ 65.5 కోట్లు.ఖైదీ నంబర్ 150కి 62 కోట్లు కాటమరాయుడు 61.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో టాప్ 5లో ఉన్నాయి.

Advertisement
సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?

తాజా వార్తలు