మ‌ళ్లీ వైసీపీలోకి మాజీ మంత్రి..!

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో మాజీ మంత్రి కొణ‌తాల రామ‌కృష్ణ‌ది ప్ర‌త్యేక‌మైన ప్రస్థానం.కొణ‌తాల కొద్ది రోజులుగా రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు కూడా ఆయ‌న్ను దాదాపుగా మ‌రిచిపోయిన‌ట్టే ఉన్నారు.

 Konathala Ramakrishna Will Join Ysrcp Again-TeluguStop.com

అప్పుడ‌ప్పుడు మీడియా ముందుకు వ‌స్తోన్న కొణ‌తాల ఏవేవో కామెంట్లు చేసేసి మ‌రీ సైలెంట్ అయిపోతున్నారు.అప్పుడ‌ప్పుడు ఉత్త‌రాంధ్ర స‌మ‌స్య‌ల మీద ఆవేశంతో స్పందించ‌డం ఆ త‌ర్వాత వెంట‌నే చ‌ల్లారిపోవ‌డం కొణ‌తాల‌కు కామ‌న్ అయిపోయింది.

మిణుగురు పురుగులా వెలిగి ఆరిపోతోన్న కొణ‌తాల మ‌రోసారి పొలిటిక‌ల్‌గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న వైసీపీలో చేరారు.

ఉత్త‌రాంధ్ర వైసీపీ రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు అయ్యారు.ఆ త‌ర్వాత జ‌గ‌న్ ఆయ‌న ప్ర‌యారిటీ త‌గ్గించేశారు.

మ‌రో షాక్ ఇస్తూ గ‌త ఎన్నిక‌ల్లో కొణ‌తాల‌ను ప‌క్క‌న పెట్టేసి ఆయ‌న సోద‌రుడు కొణ‌తాల ర‌ఘుకు సీటు ఇచ్చారు.

గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయిన కొణ‌తాల ఆ త‌ర్వాత టీడీపీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా అవి ఫ‌లించ‌లేదు.

ఇక ఇప్పుడు వైఎస్‌ను కొణ‌తాల ఓ రేంజ్‌లో పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.వైఎస్ బ‌తికి ఉండి ఉంటే.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ప్రాజెక్టులు ఇప్ప‌టిదాకా ఎందుకు ఉంటాయ‌ని ప్ర‌శ్నిస్తోన్న ఆయ‌న బాబు అమ‌రావ‌తికే అభివృద్ధిని కుదించేశార‌ని మండిప‌డ్డారు.

ఇక టీడీపీలోకి వెళ్లే ఛాన్స్ లేద‌ని అర్థ‌మైన కొణ‌తాల తిరిగి వైసీపీకి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు కూడా విశాఖ‌లో వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల ఉత్త‌రాంధ్ర‌కే చెందిన ఇద్ద‌రు మాజీ మంత్రుల‌తో పాటు ఎమ్మెల్యే రోజా సైతం కొణ‌తాల‌ను క‌లిసి వైసీపీలోకి తిరిగి తీసుకు వ‌చ్చేందుకు చ‌ర్చ‌లు జ‌రిపార‌ని కూడా టాక్‌.ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం మాత్ర‌మే ఉండడంతో ఆయ‌న తిరిగి పొలిటిక‌ల్‌గా రీ యాక్ట్ అయ్యేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలే చేస్తున్నార‌ట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube