దాస‌రి పెద్ద‌కోడ‌లికి మోహ‌న్‌బాబు స్ట్రాంగ్ వార్నింగ్‌

దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం త‌ర్వాత టాలీవుడ్‌లోనే కాదు ఆయ‌న ఫ్యామిలీలో సైతం ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.దాస‌రి అంత్య‌క్రియ‌లు కూడా ముగియ‌కుండానే ఆయ‌న పెద్ద కోడ‌లు దాస‌రి తార‌క‌ప్ర‌భు భార్య సుశీల ఆస్తి గొడ‌వ‌ల‌పై ఏకంగా మీడియాకు ఎక్క‌డం పెద్ద ర‌చ్చ‌గా మారింది.

 Mohan Babu Warning To Dasari Narayana Rao’s Daughter-in-law Susheela-TeluguStop.com

ఓ వైపు దాస‌రి అంత్యక్రియ‌ల‌కు ఏర్పాట్లు జ‌రుగుతుండ‌గానే సుశీల ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ ఆస్తిగొడ‌వ‌ల‌పై మాట్లాడ‌డం అటు ఇండ‌స్ట్రీలోను ఇటు దాస‌రి స‌న్నిహితుల్లోను తీవ్ర ఆందోళ‌న‌కు కార‌ణ‌మైంది.

సుశీల ఆస్తి వివాదంతో మీడియాకు ఎక్క‌డంపై దాస‌రి ప్రియ‌శిష్యుడు మోహ‌న్‌బాబు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో ఎంతోమందికి లైఫ్ ఇచ్చి, ఆద‌ర్శంగా నిలిచిన త‌న గురువుపై సుశీల ఇలా మాట్లాడడం మోహ‌న్‌బాబు అస్స‌లు స‌హించ‌లేక‌పోయార‌ట‌.

దీంతో మోహ‌న్‌బాబు సుశీల‌ను త‌న ఇంటికి పిలిపించుకుని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన‌ట్టు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఇలాంటి పిచ్చి ప‌నులు మానుకోవాల‌ని…నీకు అన్యాయం జ‌రిగితే దాస‌రి గారి కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాక పెద్ద‌ల స‌మ‌క్షంలో చ‌ర్చించుకోవాలే త‌ప్ప ఇలా దాస‌రి గారి అంత్య‌క్రియ‌లు కూడా పూర్తికాకుండానే మీడియాకు ఎక్క‌డం స‌రికాద‌ని ఫైర్ అయ్యార‌ట‌.

మోహ‌న్‌బాబు ఆగ్ర‌హంతో షాక్ అయిన సుశీల త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌న్న ఆవేశంతో మాట్లాడానే తప్ప మ‌రో ఉద్దేశం లేద‌ని.

మీలాంటి పెద్ద‌లు న్యాయం చేయాల‌ని మోహ‌న్‌బాబు ముందు త‌న గోడు వెళ్ల‌బోసుకుంద‌ట‌.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube