చీపురు కాళ్ళకు ఎందుకు తగలకూడదు....కారణం ఏమిటి?

మన పెద్దవాళ్ళు తరచూ చెప్పుతూ ఉంటారు.చీపురు లక్ష్మి స్వరూపం కనుక కాళ్ళకు తగలకూడదని అంటారు.

కానీ చాలా మంది దీనిని మూఢ నమ్మకంగా కొట్టి పారేస్తూ ఉంటారు.వాస్తవానికి చీపురు చివరలు, ముడివేయని తలవెంట్రుకలు,అపరిశుభ్రమైన పాదాలు, మురికిగా ఉన్న గోళ్ళు శని దేవుడు నివాసం ఏర్పరుచుకునే స్థానాలు.

దాని కారణంగా చీపురు చివర్లు కాళ్ళకు తగిలితే శని బాధలు కలుగుతాయని చీపురు కాళ్ళకు తగలకూడదని అంటారు.చీపురు కాళ్ళకు తగిలితే మంచిది కాదనే నమ్మకం మన భారతీయులకే కాకుండా ఆఫ్రికా వాసులకు కూడా ఉంది.

ఆఫ్రికా దేశం వారు అయితే చీపురు కాళ్ళకు తగిలితే ఆ ఇంటిలో మరణం సంభవిస్తుందని లేదా వారి ఇంటిలో ఎవరైనా జైలు పాలు కావాల్సి వస్తుందని నమ్ముతారు.అందుకే చీపురు ఎవరికైనా తగిలితే దానికి విరుగుడుగా ఆ చీపురు మీద ఉమ్మి వేస్తారు.

Advertisement
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు