మొబైల్ వాల్లేట్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టించి, రోజుకి కోట్ల ట్రాన్సాక్షన్స్ కి కేంద్రబిందుగా మారిన PayTM ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.PayTM Payments Bank పేరుతో దేశ రాజధాని ఢిల్లీలో తన మొదటి బ్రాంచి ఓపేన్ చేసింది.
ఈ PayTM బ్యాంకు ఏంటి ? దీంట్లో ఖాతా ఎలా తీసుకోవాలి? తీసుకుంటే లాభం ఎమిటి? మిగితా బ్యాంకులకి దీనికే తేడా ఎమిటి? నా PayTM మొబైల్ వాల్లెట్ లో ఉన్న డబ్బు ఉంటుందా? ఊడిపోతుందా ? ఇలాంటి ప్రశ్నలెన్నో మీ మొదడులో మెదులుతూ ఉంటాయి కదా.అన్నటికి మేం సమాధానమిస్తాం.
మొదట PayTM బ్యాంక్ లో ఖాతా తీసుకోవడం వలన వచ్చే లాభాల గురించి మాట్లాడుకుంటే, మీరు పైసా పెట్టకుండా ఖాతా తీసుకోవచ్చు.మామూలుగా వేరే బ్యాంకుల్లో ఖాతా తెరవాలంటే 500, 1000, 1500 ఇలా ఎంతో కొంత డిపాజిట్ చేయాలి కదా.కాని పేటిమ్ బ్యాంక్ లో అలాంటి అవసరం లేదు.జీరో మనితో ఖాతా ఓపేన్ చేసుకోవచ్చు.
మరో లాభం ఏమిటంటే మీరు ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ మేయింటేన్ చేయనక్కరలేదు.అంటే కొన్ని బ్యాంకుల్లాగా మీరు 1000, 500 ఖచ్చితంగా ఖాతాలో ఉంచాలన్న రూల్ లేదు.
మీ అకౌంటులో రూపాయి లేకున్నా మీ మీద ఎలాంటి ఫైన్ పడదు.
మీరు సేవింగ్స్ ఎకౌంటులో జమచేసుకునే డబ్బు మీద ఏడాదికి 4% వడ్డీ చెల్లిస్తారు.
మీరు విన్నది నిజమే.అంతే కాదు, మీరు జమచేసిన డబ్బు మీద క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది.ఉదాహరణకు 25,000 జమచేసారనుకోండి .250 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది.ఇంకా చెప్పాలంటే, మీరు ఆన్ లైన్ లో చేసే ట్రాన్సాక్షన్ మీద ఎలాంటి ఛార్జీ పడదు.1000 రూపాయలు మీ డెబిట్ కార్డులోంచి వాడితే సరిగ్గా 1000 మాత్రమే మీ ఎకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి.
ఇన్ని లాభాలున్నాయి కదా, మరి ఖతా ఎలా తెరవాలి అని అడగుతున్నారా? https://www.paytmpaymentsbank.com/ .ఈ లింక్ లోకి వెళ్ళి మీరు ఓ invite ని పొంది ఖాతా తీసుకోవచ్చు.ప్రస్తుతానికైతే ఖాతా నమోదు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు.త్వరలోనే మీరు మాములుగానే ఖాతా తీసుకునే వెసులువాటు వస్తుంది.దేశవ్యాప్తంగా 31 బ్రాంచీలు ఓపేన్ చేసే ఆలోచనలో ఉంది పేటిమ్.2020 నాటికి 50 కోట్ల కస్టమర్లని టార్గేట్ గా పెట్టుకుంది.
ఇక మీ వాల్లేట్ లో డబ్బుల విషయానికి వస్తే, వాటికి ఎటువంటి ఢోకా లేదు.మీరు పేటిమ్ మొబైల్ వాల్టేట్ ఎప్పటిలాగే వాడుకోవచ్చు.అందులో ఎలాంటి మార్పులు ఉండవు.మీ డబ్బు ఎక్కడికి పోదు.
మరో విషయం, పేటిమ్ మొబైల్ వాల్లేట్ వేరు, బ్యాంక్ అకౌంట్ వేరు.బ్యాంకు సర్వీసుల కోసం మీరు కొత్తగా ఖాతా తెరవాల్సిందే.
ప్రస్తుతానికైతే Savings account & Current account అందుబాటులో ఉన్నాయి.లోన్స్, ఇన్సూరెన్సు, మూచ్వల్ ఫండ్స్ త్వరలోనే అందుబాటులోకి తెస్తారట.