ఎప్పుడెప్పుడా అని అంతా వెయిట్ చేస్తున్న `బాహుబలి-2` సందడి థియేటర్లలో మొదలైంది.బాక్సాఫీస్ పై దండయాత్రకు అమరేంద్ర బాహుబలి సిద్ధమయ్యాడు.
ప్రపంచవ్యాప్తంగా 9వేల థియేటర్లలో రిలీజైంది.భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాల్లొ మార్మోగిస్తున్న ఈ చిత్రంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ ఒక్క మాట మీద నిలబడవనడానికి మరో రుజువుగా నిలిచింది.
ప్రపంచ చలన చిత్ర యవనికపై అత్యద్భుత కావ్యమని అందరూ `బాహుబలి-2` సినిమాను వేనోళ్ళ కొనియాడుతున్నారు.
జక్కన్నరాజమౌళి అత్యద్భుత టేకింగ్‌కి తోడు.అందరి నటనతో ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
అయితే ఈ సినిమా ప్రీమియర్ షోలు, టికెట్ల పెంపు విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు విరుద్ధ ప్రకటనలు చేయడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేసింది.వెయ్యి కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డు నెలకొల్పుతుందని భావిస్తుందన్న బాహుబలి ది కంక్లూజన్ గొప్ప సినిమానే అయ్యుండచ్చు కానీ అది సినిమానే అనే అంశాన్ని మరుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు ఏకంగా ఆరు ఆటలను ప్రదర్శించేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చేసింది.హైకోర్టు సైతం తన వంతు చేయి వేసింది.
మొదటి వారం రోజులూ సాధారణ థియేటర్లలో కూడా బాహుబలి సినిమాకు టికెట్లు పెంచి అమ్ముకోవచ్చని తీర్పిచ్చింది.కానీ వీటికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పకోలేదు.
తెలంగాణలో 5 షోలకే అనుమతిచ్చిన ప్రభుత్వం.ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వలేదు.
టిక్కెట్ల రేట్లు పెంచితే ఊరుకోనని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు.ఎవరైనా టికెట్టు ధర పెంచితే, ఫిర్యాదు చేయండంటూ తెలిపారు.
ఇప్పుడే కాదు గతంలోనూ కొన్ని చిత్రాలు రెండు ప్రభుత్వాలు ఇలా భిన్నంగానే వ్యవహరించాయి.గతంలో రుద్రమ దేవి చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం వినోద పన్ను మినహాయింపునిచ్చింది.
ఏపీలో రుద్రమదేవికి పన్ను మినహాయింపు ఇవ్వమని గుణశేఖర్ ఎన్నిసార్లు చెప్పినా అక్కడ సర్కార్ పెడచెవిన పెట్టింది.చివరకు ఏపీ ప్రభుత్వం ఇవ్వనంది.
బాలకృష్ణ 100వ చిత్రం `గౌతమీ పుత్ర శాతకర్ణి` చిత్రానికి వినోదపన్ను మినహాయించాయి ఇరు ప్రభుత్వాలు! కానీ ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.ఈ చిత్రాల పట్ల అనుసరించి వైఖరే బాహుబలిపై తెలంగాణలో ప్రభావం చూపిస్తోందనిపిస్తోంది.