యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి మూడు బ్లాక్‌బస్టర్ హిట్లతో మంచి జోరుమీదున్నాడు.జనతా గ్యారేజ్ సినిమా రూ.85 కోట్లు షేర్ రాబట్టి ఎన్టీఆర్ కేరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చిన్నపాటి లాంగ్ గ్యాప్ తీసుకుని పవర్ – సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాల డైరెక్టర్ కేఎస్.
రవీంద్ర (బాబి) డైరెక్షన్‌లో జై లవ కుశ సినిమా చేస్తున్నాడు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తోన్న ఈ సినిమా బిజినెస్ పరంగా అప్పుడే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.ఈ సినిమాకు రూ.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట.అలాగే శాటిలైట్ బిజినెస్ కూడా క్లోజ్ అయినట్టు తెలుస్తోంది.
ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జెమినీ జై లవ కుశ శాటిలైట్ రైట్స్‌ను రూ.14 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.ఈ రేటు ఎన్టీఆర్ కేరీర్‌లో రికార్డు స్థాయి రేటుగా నిలుస్తోంది.
ఈ సినిమాను ఎన్టీఆర్ తన చివరి సినిమా జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ అయిన సెప్టెంబర్ 1నే రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందట.







