లోకేశ్ ఎంట్రీ...ఆ ముగ్గురు మంత్రుల‌కు హ‌డ‌ల్‌...!

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ మంత్రివర్గంలో చేరడం ఖాయమైంది.ఉగాదికి ఏపీ కేబినెట్‌లో భారీ ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

 All Set For Nara Lokesh Cabinet Entry-TeluguStop.com

లోకేశ్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ కావ‌డం, ఆ వెంట‌నే కేబినెట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం అంతా చ‌క‌చ‌కా జ‌రిగిపోనున్నాయి.లోకేశ్ కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తే ఎవ‌రి శాఖ‌లకు కోత‌లు ఉంటాయ‌న్న‌దానిపై ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది

కేబినెట్‌లో దాదాపు ఆరేడు మంది మంత్రుల‌ను త‌ప్పిస్తార‌ని స‌మాచారం.

ఇక లోకేశ్ కేబినెట్‌లోకి వ‌స్తే ముగ్గురు మంత్రుల శాఖ‌ల్లో ఎవ‌రికి అయినా కోత ప‌డుతుంద‌ని కూడా తెలుస్తోంది.ప్ర‌స్తుతం చంద్ర‌బాబు వ‌ద్దే మౌలిక స‌దుపాయాల‌తో పాటు ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, సినిమాటోగ్ర‌ఫీ, న్యాయ‌శాఖ‌, ప‌ర్యాట‌క శాఖ‌లు ఉన్నాయి

చంద్ర‌బాబు వ‌ద్ద ఉన్న శాఖ‌లే లోకేశ్‌కు ఇస్తే విస్త‌ర‌ణ‌లో పెద్ద మార్పులు ఉండ‌వు.

అలా కాకుండా తెలంగాణ‌లో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మునిసిప‌ల్, ఐటీ శాఖ‌ల‌తో ముందుకు దూసుకెళుతున్నారు.లోకేశ్‌కు కూడా అవే శాఖ‌లు ఇవ్వాల‌ని బాబు నారాయ‌ణ శాఖ‌ల్లో కోత త‌ప్ప‌దు.

అలా కాకుండా కీల‌క‌మైన మాన‌వ వ‌న‌రుల శాఖ కావాల‌నుకుంటే నారాయ‌ణ వియ్యంకుడు అయిన గంటా శ్రీనివాస‌రావు శాఖ‌ల్లోను, ఐటీ శాఖ కోసం ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి శాఖ‌ల‌కు కోత త‌ప్ప‌దు

లోకేశ్ త‌మ శాఖ‌ల‌ను ఎక్క‌డ లాక్కుపోతాడో అని ఈ ముగ్గురు మంత్రులు లోలోన ఆందోళ‌న చెందుతూనే ఉన్నార‌ట‌.ఇక చాలా మంది మంత్రుల ప‌నితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చంద్ర‌బాబు ఆరేడుగురికి ఉద్వాస‌న ప‌లుకుతార‌ని.

కొత్త‌గా 8-10 మంది మంత్రులు కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube