టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి మూడు బ్లాక్‌బస్టర్ హిట్లతో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.ఎన్టీఆర్‌కు పౌరాణికాలు అయినా సాంఘికాలు అయినా కొట్టినపిండే.
యమదొంగ, బాల రామాయణం నుంచి ఆది, స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, నాన్నకు ప్రేమతో ఇలా ఏ సినిమా చూసినా ఎన్టీఆర్ పాత్ర పోషణలో వైవిధ్యం మనకు కనపడుతుంది.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఇప్పుడు మరో సరికొత్త రోల్‌లో తన కొత్త సినిమాలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ తన 27వ సినిమాను (వర్కింగ్ టైటిల్ జై లవ కుశ) బాబి దర్శకత్వంలో చేస్తున్నాడు.కళ్యాణ్‌రామ్ నిర్మించే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటిస్తాడని వార్తలు వచ్చాయి.అయితే పవన్-త్రివిక్రమ్ ప్రాజెక్టు డిలే అయ్యే ఛాన్సులు ఉండడంతో ఎన్టీఆర్ బాబి సినిమా కంప్లీట్ అయిన వెంటనే వినాయక్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్-వినాయక్ కాంబోలో తెరకెక్కే సినిమాలో ఎన్టీఆర్ బ్యాట్ పట్టి సిక్సర్లు, ఫోర్లు బాదుతాడట.క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో ఎన్టీఆర్ హీరోగా వినాయక్ ఓ మాంచి మాస్ కమర్షియల్ సబ్జెక్టును రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇది వినాయక్ స్టైల్లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని సమాచారం.మరి క్రికెటర్‌గా ఎన్టీఆర్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.







