కోట్లు దండుకుంటున్న దిల్ రాజు

పట్టిందల్లా బంగారమే.2015 లో బాహుబలి నైజాం హక్కులు చేజిక్కుంచుకోని కోట్ల లాభాలు జేబులో వేసుకున్నారు.2016 లో ఏమి తగ్గలేదు.ఐదారు బ్లాక్బస్టర్ సినిమాలని పంపిణీ చేసి తన నిర్ణయాల్లో ఎంత ఖచ్చితత్వం ఉంటుందో నిరూపించుకున్నారు.

 Dil Raju Already In Heavy Profits In 2017-TeluguStop.com

ఇక 2017 లో కనీసం రెండు నెలలు గడవలేదు, అప్పుడే పదుల కోట్ల లాభాల్లోకి వెళ్ళిపోయారు నిర్మాత దిల్ రాజు.

శతమానంభవతి సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలకి పోటిగా వచ్చి 30 కోట్లకు పైగా షేర్ రాబట్టుకోని, ఇంకా బాగా ఆడుతుండటం ఏంటి, ఈ సినిమా థియేటర్లో ఉండగానే నేను లోకల్ వచ్చి మూడు రోజుల్లోనే 70% శాతానికి పైగా రికవర్ చేసుకోని 15 కోట్ల షేర్ సంపాదించడం ఏంటి .రాజు గారి లక్కు కాదు ఇది.ఆయన జడ్జిమెంటు మహిమ.ఏ సినిమా ఎలా ఆడుతుందో ఊహించే మెదడు మ్యాజిక్.

ఈ ఏడాది ఇంకెన్ని సినిమాలు నిర్మిస్తారో, ఎన్ని సినిమాలు పంపిణి చేస్తారో, ఇంకెన్ని కోట్లు దండుకుంటారో మరి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube