ఏపీలో బీజేపీకి స‌మాధి..?

ఏపీలో క‌మ‌లానికి క‌ష్ట‌కాలం మొద‌లైంది.గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 2 ఎంపీ స్థానాల‌తో పాటు 4 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది.

 Tough Time To Bjp In Andra Pradesh-TeluguStop.com

వీరిలో బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్‌, పైడికొండ‌ల మాణిక్యాలరావుకు చంద్ర‌బాబు త‌న కేబినెట్‌లో చోటు కూడా క‌ల్పించారు.ఇక అక్క‌డి నుంచి ఈ రెండు పార్టీల మ‌ధ్య స్నేహం అస్స‌లు పొస‌గ‌డం లేదు.

ఏపీకి ఇచ్చిన హామీలు కేంద్రం నెర‌వేర్చ‌డం లేద‌ని టీడీపీ నేత‌లు బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉంటుంటే…మ‌రో వైపు ఏపీలో టీడీపీ త‌మ పార్టీని నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తోంద‌ని బీజేపీ నేత‌లు టీడీపీపై ఫైర్ అవుతున్నారు.

రెండు పార్టీల మ‌ధ్య పైకి ఎలా ఉన్నా లోప‌ల మాత్రం కూల్ వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది.

ఇక టీడీపీతో పొత్తు పొస‌గ‌ట్లేదంటూ బీజేపీ నేత‌లే బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు.టీడీపీపై ఒంటికాలితో లేస్తోన్న బీజేపీ ఎమ్మెల్యే సోము వీర్రాజు ఏకంగా టీడీపీ అధినేత‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

నిన్న‌టి వ‌ర‌కు సోము వీర్రాజుకు అండ‌గా ఉన్న మంత్రి పైడికొండ‌ల ఇప్పుడు చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఇక మ‌రో మంత్రి కామినేని శ్రీనివాస్‌, కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు చంద్ర‌బాబు గీసిన గీత దాట‌ర‌న్న ప్ర‌చార‌మూ ఉంది.

ఇక కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన సీనియ‌ర్ నేత‌లు, మాజీ మంత్రులు కావూరు సాంబ‌శివ‌రావు, ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణకు చంద్ర‌బాబు అంటే గిట్ట‌దు.అయితే ఏపీ బీజేపీ వీరిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేసింది.

దీంతో వీరంతా తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు.అంతే కాకుండా వీరంతా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగానే వైసీపీలో చేరిపోతార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రో వైపు గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ద‌తుగా ఉన్న ప‌వ‌న్ ఇప్పుడు ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీతో పాటు మోడీని ఏకేస్తున్నా ప‌వ‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చేవాళ్లు బీజేపీలో క‌రువ‌య్యారు.వీటికి తోడు ఇక్క‌డ టీడీపీ బీజేపీ నాయ‌కుల‌ను నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రయారిటీ ఇవ్వ‌లేదు.

ఇక ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మాట త‌ప్ప‌డంతో కూడా కేంద్రంపై ఏపీ జ‌నాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది.టీడీపీతో పొత్తు ఉంటే ఏమోగాని ఆ పార్టీ సొంతంగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేదు.

ఇవ‌న్నీ చూస్తుంటే 2019 ఎన్నిక‌ల నాటికి బ‌ల‌మైన రాజ‌కీయ‌శ‌క్తిగా ఎదిగి ఏపీలో సొంతంగా పోటీ చేస్తామ‌ని గొప్ప‌ల‌కు పోయిన బీజేపీ నేత‌లు ఇప్పుడు ఇక్క‌డ ఆ పార్టీ స‌మాధి అవుతున్నా ఆప‌లేక‌పోతున్నారు.మ‌రోవైపు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడి ఎంపిక‌పై కూడా రెండు గ్రూపులు గొడ‌వ‌ల‌కు దిగుతున్నాయి.

ఇంత‌టి క్లిష్ట ప‌రిస్థితుల్లో ఏపీ బీజేపీని ఆ దేవుడే కాపాడాలి.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube