ఎక్కడైనా ఏదైనా కొనాలంటే అయితే చేతిలో క్యాష్ అయీనా ఉండాలి, లెదంటే డెబిట్ కార్డు అయినా తీసుకెళ్ళాలి, అది కాదంటే, మొబైల్ ఉండి, అందులో ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉండాలి.క్యాష్ తక్కువ వాడే ఎకనామిగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనేది మన ప్రభుత్వ అలోచన.
కాబట్టి క్యాష్ ఆప్షన్ ప్రత్సాహాన్ని ఇవ్వగలిగేది కాదు.
బ్యాంక్ కార్డులు గ్రామీణ ప్రజలు కూడా అంత త్వరగా తీసుకోవడం కష్టం.
ఇక మొబైల్ వ్యాలెట్ ఎలా వాడాలో కూడా గ్రామీణ ప్రజలకు సరిగా తెలియదు, అలాగే మొబైల్ వాలెట్స్ చెల్లింపులు అన్ని చోట్ల తీసుకోరు.దాంతో ప్రభుత్వం మరో కొత్త అలోచనలో ఉంది.
ఆధార్ కార్డుతోనే చెల్లింపులు చేసే వెసులుబాటు తీసుకురానుంది మన ప్రభుత్వం.
దాన్నే “ఆధార్ పే” అని అంటున్నారు.
ఇప్పటికే ఆధార్ పే లో 14 ముఖ్యమైన బ్యాంకులు నమోదవగా, మిగితా బ్యాంకులు త్వరలోనే వచ్చిచేరతాయి.ఆ తరువాత మన బ్యాంక్ అకౌంటుకి మన ఆధార్ కార్డుని అనుసంధానం చేసుకుంటే చాలు .ఆధార్ తోనే చెల్లింపులు చేయవచ్చు.
చెల్లింపులు ఎలా చేయాలి? పద్ధతి ఏంటి ? అన్ని వివరాలు త్వరలోనే తెలియపరుస్తారు.మరో వార్త ఏంటంటే, BHIM యాప్ ని కూడా ఈ ఆధార్ చెల్లింపులతో కనెక్టు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.శూభవార్తలే కదా ఇవి!
.






