మహేంద్ర బాహుబలిని భల్లాలదేవుడి భటుల నుంచి రక్షించి తన ప్రాణాల్ని విడిచింది శివగామి.శివుడు అనే పేరుతో, ఒక తెగలో పెరిగిన శివుడు, తాను బాహుబలి కొడుకునని, ప్రస్తుతం భల్లాలదేవుడి ఆధీనంలో ఉన్న మాహిశ్మతి సింహాసనానికి వారసుడినని తెలుసుకోవడంతో మొదటిభాగం ముగిసింది.
ఇక అమరేంద్ర బాహుబలికి – భల్లాలదేవుడికి మధ్య జరిగిన పూర్తి కథ ఏంటో, ఆ కథలో ఇటు శివగామి, అటు దేవసేన ఎలాంటి పాత్రలు పోషించారో, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో మనకు రెండొవ భాగం వస్తే తప్ప తెలియదు.
కాని, అమరేంద్ర బాహుబలి పుట్టకమునుపు లేదా, పసితనం నుంచే మాహిశ్మతి గాథలను మనం తెలుసుకునే అవకాశం ఉంది.
శివగామి పాత్ర పుట్టుపూర్వోత్తరాలు అన్ని తెలుసుకోవచ్చు.ఎలాగో మీకు తెలుసు అనుకుంటా.
Baahubali – Before the beginning పేరుతో బాహుబలి – ది బిగినింగ్ కి ముందు జరిగిన కథ మూడు పుస్తకాల రూపంలో రానున్న సంగతి మీకు తెలిసిందే.ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ రచించిన ఈ పుస్తకాల్లోని, మొదటి పుస్తకం “ది రైజ్ ఆఫ్ శివగామి” యొక్క బుక్ కవర్ ని ఈరోజు ఆవిష్కరించారు రాజమౌళి.Amazon.com లో ఈ పుస్తకం అందుబాటులోకి వచ్చింది.వెల 299 రూపాయలు అయినా, ప్రీ ఆర్డర్ లో మీకు 60 రూపాయల డిస్కౌంటు లభిస్తుంది.మార్చి 7వ తేదినుంచి పుస్తకం డెలివరి మొదలవుతుంది.ఈ పుస్తకాలు చదివి మీరు బాహుబలికి ముందు జరిగిన కథ మొత్తం తెలుసుకోవచ్చు.
మరింకెందుకు ఆలస్యం ?







