వీడియోలు రకరకాల ఫార్మాట్స్ లో ఉంటాయి.AVI/MKV/MP4/FLV/3GP ఇలా అన్నమాట.అన్ని ఫార్మాట్స్ అన్నిరకాల మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో ప్లే కావు.అలాగే స్మార్ట్ ఫాన్స్ కొన్ని విడియో ఫార్మాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి.ఒక్కోసారి మనకు అవసరమైన విడియో మన ప్లేయర్ లో సపోర్ట్ అవదు.అప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
దాంతో విడియో కన్వర్టర్ డవున్లోడ్ చేసుకోని, మనకు అవసరమైన ఫార్మాట్ లోకి వీడియోని కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది.కాని, అసలు కొత్తగా విడియో కన్వర్టర్ ని వాడాల్సిన అవసరం లేదు.
మన కంప్యుటర్ లో ఖచ్చితంగా ఉండే VLC Media Player ని వాడుకొని, మన విడియోని రకరకాల ఫార్మాట్స్ లోకి మార్చుకోవచ్చు.ఎలా అంటారా !
* మీ VLC ప్లేయర్ ని ఓపెన్ చేయండి.
టాప్ లెఫ్ట్ లో కనిపించే MEDIA ఆప్షన్ మీద క్లిక్ చేసాక, కింది నుంచి నాలుగోవ ఆప్షన్ గా Convert/Save అనే ఆప్షన్ కనబడుతుంది.క్లిక్ చేయండి.
* ఓ కొత్త పేజ్ లో Add మరియు Browse అనే రెండు ఆప్షన్స్ కనబతాయి.యాడ్ మీద నొక్కి మీరు కన్వర్ట్ చేయాల్సిన విడియో ఫైల్ ని సెలెక్ట్ చేయండి.
ఆ వీడియోకి ఏదైనా Subtitle ఫైల్ యాడ్ చేయాల్సి ఉంటె, బ్రౌజ్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి.ఆ తరువాత కింద కనిపించే Convert/Save మీద క్లిక్ చేయండి.
* మరో కొత్త పేజిలో Destination File అనే ఆప్షన్ పక్కన Browse కనబడుతుంది.దాని మీద క్లిక్ చేసి, ఎక్కడైతే కన్వర్ట్ చేస్తున్న ఫైల్ ని సేవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోండి.
* అదే పేజిలో, కాస్త కింద Profile అనే ఆప్షన్ కనబడుతుంది.దాన్ని పక్కన బ్రాకెట్ లో రకరకాల ఫార్మాట్స్ ఆప్షన్స్ ఉంటాయి.
అక్కడ మీకు కావాల్సిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని, Start మీద క్లిక్ చేయండి అంతే.మీ విడియో కన్వర్షన్ మొదలవుతుంది.







