తెలంగాణ అధికార పార్టీకి చెందిన నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హద్దు దాటేశారు! తన నియోజకవర్గం ప్రజలపై తీవ్ర అసహనం ప్రదర్శించారు.తనను ప్రశ్నించిన పాపానికి సభావేదికపైనే ప్రజలను మూకుమ్మడిగా కడిగి పారేశారు.
మళ్లీ 2019 ఎన్నికల్లో తాను ఎన్నికల్లో పొటీకి నిలవాల్సి ఉంటుందని కానీ, తనను ప్రజలు గెలిపించాలని కానీ ఎక్కడా ఆలోచించకుండా మనసులో ఉన్న మాటలను కుండబద్దలు కొట్టేశారు.దీంతో సభకు వచ్చిన జనాలు షాక్ తిన్నారు.
మరి ఏం జరిగిందో చూద్దాం.
బాల్కొండ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో చెరువుకు చెక్ డ్యాం కట్టమని గత కొన్నాళ్లుగా రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
అయినా కూడా ఎమ్మెల్యే వేముల ఎంత మాత్రమూ పట్టించుకోలేదు.దీంతో రైతులు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రశాంత్ రెడ్డి అదే గ్రామంలో నిర్వహించిన సభకు హాజరయ్యారు.ఈ విషయం తెలుసుకున్న రైతులు, ప్రజలు ఎమ్మెల్యే కాన్వాయ్‌కి అడ్డు తగిలారు.
సీఎం కేసీఆర్ సహా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పార్టీ టీఆర్ ఎస్ డౌన్ డౌన్ అని నినదించారు.
దీంతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
సభ ప్రారంభం కాగానే.
తన ఆగ్రహాన్ని మొత్తం వెళ్లగక్కారు ప్రశాంత్ రెడ్డి.తాను ఎంతో కోటీశ్వరుడినని, ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని, పార్టీకి కొన్ని కోట్లు ఇచ్చానని చెప్పుకొచ్చారు.
నా కాన్వాయ్‌కి అడ్డుతగిలినారు కాబట్టి మీ చెవురుకు చెక్ డ్యాం కోసం నూరు సార్లు.హైదరాబాద్‌కి తిప్పించుకుంటా అంటూ శపథం చేశారు.
ఈ వ్యాఖ్యలతో అందరూ విస్తుపోయారు.
ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు సర్ది చెప్పాల్సిన ప్రజాప్రతినిధి ఇలా కోట్ల లెక్కలు చెప్పడం, నూరు సార్లు తిప్పించుకుంటా అని హెచ్చరించడం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి.మరి ఇలా దుందుడుకుగా మాట్లాడితే.2019 ఎన్నికల్లో ప్రజలు ఈయనని ఎలా ఎన్ని సార్లు ఓట్ల కోసం తిప్పిస్తారో చూడాలి అనే కామెంట్లు మొదలయ్యాయి.మొత్తానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
MLASerious Comments, Balkonda constituency, Check dam Issue







