దీపావళి టాపాసులతో చేతులు కాల్చుకుంటే ఇంట్లోనే చికిత్స

దీపావళి వచ్చేసింది.ఈరోజు మొదలు, మరో పదిహేను రోజుల దాకా టపాసుల మోతే.

 Home Remedies For Burn Injuries On Diwali-TeluguStop.com

రెండుపదుల వయసు దాటని వారిని కూడా ఆపడం కష్టం.వయసుతో సంబంధం లేకుండా అందరు క్రాకర్స్ పేలుస్తారు.

కాని టపాసులు కాల్చడం అంటే, నిప్పుతో ఆటలాడటమే.ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో చెప్పలేం.

కాలిన గాయాలు సామాన్యంగా చూసే సీజన్ ఇది.మరి గాయాలు మానాలంటే ఏం చేయాలి?

* మన ఇంట్లో ఉండే ఫస్ట్ ఏడ్ పసుపు.ఇది యాంటిసెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటుంది.ఏమాత్రం చిన్న గాయమైనా ముందుగా పసుపు రాయండి.ఇది గాయం పెరగకుండా ఆపుతుంది

* గాయం ఉన్న ప్రాంతంలో చన్నీళ్ళు పోయండి.ఇది గాయం ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది

* కలబందను మించిన ఔషధం ఉంటుందా? అందుకే కాలిన గాయాలకు వెంటనే కలబంద గుజ్జుని రాయండి.ఇది బొబ్బలు రాకుండా కాపాడుతుంది.అలాగే మంటను తగ్గిస్తుంది

* ఆశ్చర్యకరంగా ఉన్నా, కాలిన గాయాలకి టూత్ పేస్ట్ రాయడం కూడా పనిచేస్తుంది.ఇది కూడా చల్లటి ఫిలింగ్ కలిగిస్తుంది

* కాలిన గాయాలకు తేనే రాస్తే తక్షణమే ఉపశమనాన్ని పొందవచ్చు.ఇది గాయం దగ్గర ఎలాంటి ఇంఫెక్షన్స్ చేరకుండా అడ్డుకుంటుంది కూడా

* ఇంట్లో వెనిగర్ ఉంటే, దాంట్లో బట్టను ముంచి, డైరెక్టుగా కాకుండా, ఆ క్లాత్ తో గాయంపై మెల్లిగా అద్దుతూ ఉండండి.

కాస్త రిలీఫ్ దొరుకుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube