చెన్నై బ్యూటి త్రిష దాదాపుగా తెలుగు టాప్ హీరోలందరితో నటించింది.ఇక సూపర్ స్టార్ మహేష్ తో రెండుసార్లు పనిచేసింది.
వీరి కలయికలో వచ్చిన “అతడు” క్లాసిక్ గా నిలిస్తే, సైనికుడు దానికి వ్యతిరేకమైన ఫలితాన్ని సాధించింది.ఇంతవరకే వీరి ఫ్రెండ్ షిప్ గురించి మనకు తెలుసు కాని, ఇద్దరి పరిచయం సినిమా ఇండస్ట్రీలో జరగలేదట.
కాలేజి సమయంలోనే ఇద్దరికి పరిచయం ఉండేదట
తెలుసుగా, రాజకుమారుడు చేసేంతవరకు మహేష్ హైదరాబాద్ లో పెద్దగా గడిపింది లేదు.బాల్యం నుంచి చైన్నైలోనే.
అక్కడే కాలేజి పూర్తి చేశాడు.అప్పుడే మహేష్ కి త్రిషకి పరిచయం ఏర్పడిందట
తన నూతన చిత్రం కోడి (తెలుగులో ధర్మయోగి) ప్రమోట్ చేస్తూ తమిళ మీడియాతో ముచ్చటించిన త్రిష, మహేష్ టాపిక్ రాగానే “మహేష్ నా ఫేవరేట్.
నాకు చాలా ఇష్టం తనంటే.ఒక ఆర్టిస్ట్ గా నాకు మహేష్ నుంచి గౌరవం దక్కింది.
ఒక సూపర్ స్టార్ నుంచి అలాంటి గౌరవం దక్కడం అరుదుగా చూసేది.చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, నాకు తను కాలేజి సమయం నుంచే తెలుసు.
అప్పుడే తనతో పరిచయం ఏర్పడింది.తను పనికి ఇచ్చే విలువ ఎలా ఉంటుందంటే, అతడు చేస్తున్న సమయంలో ఒక్కోసారి ఉదయం నుంచి రాత్రి 10 గంటలదాకా సెట్లోనే ఉండేవాడు.
నేను త్వరగా వెళ్ళిపోతే చాలా అవమానకరంగా ఉండేది.తన లాంటి హీరో అంతసేపు సెట్లోనే గడిపితే, నేనుందుకు అభ్యంతరం చెప్పాలి.
తనెప్పుడు వానిటి వ్యాన్ లోకి వెళుతున్నప్పుడు చూడలేదు.ఎప్పుడు సెట్లోనే, తన సన్నివేశం లేకపోయినా ఉంటాడు.
కాని ఎవరి పని వారినే చేసుకోనిస్తాడు.అస్సలు కలుగజేసుకోడు” అంటూ పాత జ్ఞాపకాలని నెమరువేసుకుంది.