`రంగం` ఫేమ్ జీవా, కాజల్ అగర్వాల్ `ఎంత వరకు ఈ ప్రేమ`

`రంగం` వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ `కవలై వేండాం`.ఈ చిత్రాన్ని తెలుగులో `ఎంత వరకు ఈ ప్రేమ` అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

 Jiva And Kajal Aggarwal Entha Varaku Ee Prema-TeluguStop.com

`యామిరుక్క బ‌య‌మేన్‌` ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.ఈ సందర్భంగా….

డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో పరిచయమైన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ కావడంతో సినిమా తెలుగు హక్కుల కోసం మంచి పోటీ ఏర్పడింది.అయితే ఫ్యాన్సీ రేటు చెల్లించి తెలుగు హక్కులను సొంతం చేసుకున్నాను.`ఎంతవరకు ఈ ప్రేమ` అనే పేరుతో సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాం.ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తెలుగు, తమిళంలో అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.`రంగం` చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను కూడా త‌మిళంలో నిర్మిస్తుండ‌టం విశేషం.

సినిమాపై ఉన్న అంచ‌నాల‌తో అల్రెడి రెండు ఏరియాల బిజినెస్ కూడా పూర్త‌య్యింది.మిగిలిన ఏరియాస్ కు మంచి బిజినెస్ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి.

క్రేజీ కాంబినేష‌న్ కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి“ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube