ఎనెర్జటిక్ స్టార్ రామ్ మరో మాస్ ఎంటర్టైనర్ తో రెడీ అయిపోయాడు.పెద్ద చిత్రాల నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్రొడక్షన్ లో రామ్ నటించిన హైపర్ ప్రస్తుతుం పోస్ట్ ప్రడక్షన్ వర్క్స్ లో ఉంది.
కందిరీగ, రభస చిత్రాలు రూపొందించిన సంతోష్ శ్రీనివాస్ దీనికి దర్శకుడు.రాశీఖన్నా కథానాయిక.
దూకుడు చిత్రం ఈ నెల 23వ తేదిన 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హైపర్ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు నిర్మాతలు.
ఇక ఈ చిత్రం ముందు ప్రకటించినట్టుగా సెప్టెంబర్ 30న రావట్లేదని, దానికి బదులుగా దసరా సీజన్ బరిలో అక్టోబర్ 6న విడుదల కాబోతోందని ట్రేడ్ వర్గాలకి ఈరోజు వార్తలందాయి.
దాంతో దసరాకి రిలీజ్ అవుతున్న సినిమాల్లో మార్పు జరుగుతుందని అనుకున్నారంతా.అంతేకాదు, హైపర్ పోస్ట్ పోన్ అవడం వలన జనతా గ్యారేజ్ కి లాభమని, మరికొన్ని రోజులు ఎన్టీఆర్ సినిమా కలెక్షన్లు దండుకోవచ్చని అంచనా వేశారు ట్రేడ్ విశ్లేషకులు.
కాని అలాంటిదేమి జరగట్లేదు.
ఇవన్ని రూమర్లే అని కొట్టిపరేశారు హైపర్ నిర్మాతల్లో ఒకరైన అనీల్ సుంకర.
హైపర్ పోస్ట ప్రొడక్షన్ వర్క్స శరవేగంగా జరుగుతున్నాయని, ముందు అనుకున్నట్లుగానే సెప్టెంబర్ 30 తేదిన సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ప్రకటించారు.







