ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన షోగా వెలుగొందుతోంది “మీలో ఎవరు కోటీశ్వరుడు”.అమితాబ్ బచ్చన్ లాంటి మహానటుడు హిందీలో చేస్తున్న షోకి నాగార్జున ఎంతమాత్రం సరిపోతారు అని అనుమానపడ్డ వారందరి నోటికి తాళం వేసే రేంజ్ కి ఈ షోని తీసుకెళ్ళారు అక్కినేని నాగార్జున.
మరి ఇప్పుడు ఈ షోకి నాగార్జున కాకుండా చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని చెబితే?
మెగాస్టార్ షో నిర్వహిస్తారంటే ఆనందపడాలో, లేక నాగార్జున వ్యాఖ్యాతగా ఉండట్లేదని బాధపడాలో అర్థం కావడం లేదా? ఈ వార్త విన్న వారందరి పరిస్థితి అలానే ఉంది.కాని, మొత్తం మీద మెగాస్టార్ టెలివిజన్ రంగప్రవేశం నిజంగా హర్షించదగ్గ విషయమే.
అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాకపోయినా, దాదాపుగా ఇదే జరగబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.డిసెంబరు 12వ తేది నుంచి చిరంజీవి వ్యాఖ్యాతగా “మీలో ఎవరు కోటీశ్వరుడు” కొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది.







