అవసరల శ్రీనివాస్ డైరక్షన్ లో నారా రోహిత్, నాగ శౌర్య కలిసి చేస్తున్న యువ హీరోల మల్టీస్టారర్ మూవీ జ్యో అచ్యుతానంద.సినిమా ట్రైలర్ చూస్తే అన్నదమ్ములు ఇద్దరు రెజినాకు లైన్ వేస్తున్న సంగతి తెలుస్తుంది.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అవసరాలకు మంచి స్నేహితుడు అయిన నాని ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ చేస్తున్నాడట.ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం రెజినా ఆ ఇద్దరి అన్నదమ్ములకు హ్యాండ్ ఇచ్చి నానితో వెళ్తుందట.
అయితే జ్యో అచ్యుతానంద సినిమాలో నాని ఉన్నాడనే విషయాన్ని బయటకు పొక్కనీయట్లేదట.సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా కేవలం ట్రయాంగిల్ లవ్ స్టోరీనే కాదు అన్నదమ్ముల అనుబంధం కూడా చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నాడు అవసరాల శ్రీనివాస్.
మరి పోటీ పడి, ప్రయాస పడి మరి రెజినా కోసం నానా తిప్పలు పెడితే నాని ఇలా వచ్చి అలా అమ్మడనిని తీసుకెళ్తాడట.సినిమా కథ కథనాలు కొత్తగా ఉంటాయంటూ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అవసరాల నమ్మకంతో ఉన్నాడు.
మరి శ్రీనివాస్ నమ్మకాన్ని జ్యో అచ్యుతానంద నిలబడుతుందా అన్నది చూడాలి.
.






