‘జనతా గ్యారేజ్’ చిత్ర యూనిట్ సినిమాకి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకొనే పనిలో పడింది.రేపు ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమాపై అంచనాలు చాలా ఉన్నాయి.
అంతేకాక ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని గట్టి నమ్మకంగా ఉన్నారు.జనతా గ్యారేజ్ నైజాం ఏరియాని దిల్‌రాజు సొంతం చేసుకోవటంతో ఈ సినిమాని క్యాష్ చేసుకొనే విషయంలో వ్యూహాలను రచిస్తున్నాడు దిల్ రాజు.
దిల్ రాజు తన పలుకుబడిని ఉపయోగించి టిక్కెట్ రేటు పెంచుకోవటంలో సఫలీకృతం అయ్యారు.ఈ మేరకు ప్రభుత్వం నుండి అనుమతి పత్రం కూడా వచ్చేసింది.హైదరబాద్‌లోని సింగిల్ స్క్రీన్‌లో టికెట్టు ధర రూ.60 నుంచి 75 రూ.వరకూ ఉంది.ఈ టికెట్ ఇప్పుడు రూ.100 అయ్యింది.నైజాం అంతా ఇదే ధర వర్తిస్తుంది.
ఈ రేటుతో వారం రోజులు పాటు వసూలు చేసుకోవచ్చు.దాంతో.
నైజాం ఏరియాలో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.ఇక మీదట పెద్ద సినిమాలన్నీ ఇదే ధర ఫాలో అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.







