ముద్దు .రెండు పెదాలు ప్రేమతో వేసే ఓ ముద్ర.
అదో మధుర అనుభవం.ప్రేమను వ్యక్తపరిచే ఓ అద్భుతమైన మార్గం.
అందుకే సినిమాల్లో కూడా ప్రేయసి ప్రేమికుల మధ్య ముద్దు సన్నివేశాలు పెడుతూ ఉంటారు.అయితే ముద్దు పెట్టడానికి కూడా కొన్ని పద్ధతులు, నియమాలు ఉన్నాయి.
అవి జవదాటితే, ముద్దు అందంగా కనబడకపోవచ్చు, లేదా కామంలాగా కనబడొచ్చు.ముద్దు అసలు ఎలా పెట్టాలంటే .
* ముద్దు పెట్టేముందు చేయాల్సిన అతిముఖ్యమైన పని నోటిని శుభ్రం చేసుకోవడం.అలాగే ఎండిన పెదాలతో ముద్దుని భాగస్వామి ఆస్వాదించడం కష్టం.
అందుకే పెదాలు మృదువుగా, తడిగా ఉన్నప్పుడు ముద్దు పెట్టడం మంచిది.దాంతో పాటు పెదాలకి ఏదైనా గాయం జరిగినప్పుడు, అసలు ముద్దు జోలికి వెళ్ళకపోవడమే మంచిది.
* అలాగే మద్యపానం, మాంసాహారం, ధూమపానం చేసిన వెంటనే ముద్దులోకి వెళ్ళోద్దు.
* ముద్దులో కనులు ఖచ్చితంగా మూసుకుంటే మంచిది.
ఏదైనా అనుభవించాలంటే పూర్తి ఏకాగ్రత అవసరం.కాబట్టి కనులు మూసి ముద్దు పెట్టాలి (దాదాపుగా అందరు ఇలానే చేస్తారు అనుకోండి).
ఇక కనులు మూసుకోవాలి అని చెప్పడానికి మరో కారణం, ఎంత అందంగా ఉన్న ముఖమైన అంత దగ్గరగా చూడటం కష్టమైన విషయమే.
* పెదాలు ఎంతలా తెరవాలి అనేది కూడా చూసుకోవాలి.
అతిగా తెరిచి ఓవర్ చేయకూడదు.అలాగని చిన్నగా మూసేసి మొహమాటపడకూడదు.
* ముద్దుని ఎక్కడ, ఎప్పుడు ఆపాలో అక్కడే ఆపాలి.అతికి పోతే అది మీ భాగస్వామికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు.
ఎందుకైనా మంచిది, మొదట మీరే ఆపేయ్యండి.
* ముద్దుల్లో కూడా చాలారకాలు ఉంటాయి.
ఎప్పుడూ ఒకే రకమైన ముద్దు పెట్టకుండా, కిస్సింగ్ లో ఉన్న ఇతర పద్ధతులని కూడా ఓసారి ట్రై చేస్తే మంచిది.