మునగ కాయతో రసం,సాంబార్,కూర ఇలా ఏది చేసుకున్నా రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది.మునగలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
దీనిలో ఖనిజాలు,మాంసకృత్తులు,విటమిన్స్ ఉండుట వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
మునగలో ఉండే క్యాల్షియం,ఇనుము మరియు ఇతర విటమిన్స్ ఎముకలు బలంగా ఉండటానికి సహాయం చేస్తాయి.
పిల్లల్లో ఎముకలు గట్టిగా మారటానికి తరచుగా మునగ ఆకును పెడుతూ ఉండాలి.
మునగ ఆకులు, గింజలలో యాంటీ బయటిక్ గుణాలు ఉండుట వలన మొటిమల వంటి చర్మ సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.
అంతేకాక రక్తవృద్ధికి కూడా సహాయపడుతుంది.
మధుమేహ రోగులలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచి మధుమేహంను కంట్రోల్ చేస్తుంది.
గర్భధారణ సమయంలో మునగ ఆకును ఆహారంలో భాగంగా చేసుకుంటే గర్భధారణ సమయంలోను మరియు ప్రసవం అనంతరం వచ్చే సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.
మునగలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన ఇన్ఫెక్షన్స్ దరి చేరవు.
అలాగే శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తాయి.జీర్ణశక్తి పనితీరు మెరుగుపడుతుంది.







