ఓ సినిమా హిట్ కొట్టడం అంటే ఆ సినిమా కథగా దగ్గరకు వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటేనే అది రిలీజ్ అయి హిట్ అవ్వగలదు అన్న విషయం అర్ధం చేసుకోగలం.ఇంతకీ దేనికి ఈ క్లాసంతా అంటే రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ మౌత్ టాక్ తో మంచి వసూళ్లను రాబడుతున్న సినిమా పెళ్లిచూపులు.
తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రాజ్ కందుకూరి నిర్మించారు.ఇక సినిమా కంటెంట్ నచ్చి సురేష్ బాబే సినిమాను రిలీజ్ చేశాడనుకోండి.
విజయ్ దేవకరకొండ, రీతు వర్మ చేసిన ఈ సినిమాలో రీతు వర్మ పాత్రకు ముందు మెగా డాటర్ నిహారికను సంప్రదించారట.
అప్పటికే ఒక మనసు చేస్తున్న నిహారిక ఈ సినిమా దర్శకుడి మీద అంత నమ్మకం కుదరక సినిమా మిస్ చేసుకుంది.
ఇక తాను వదిలిన ఈ ఆఫర్ వాడుకున్న రీతు మంచి హిట్ దక్కించుకుంది.ఒకవేళ ఇదే సినిమా నిహారిక చేసుంటే కచ్చితంగా ఇంకా చాలా పెద్ద హిట్ అయ్యుండేది.
మరి కథల విషయంలో కరెక్ట్ డెశిషన్ తీసుకుంటేనే తప్ప లేదంటే ఇలాంటి హిట్ సినిమాలను మిస్ చేసుకోవాల్సి వస్తుంది.ఈ విషయం నిహారికకు పెళ్లి చూపులు చూశాకైనా అర్ధమయ్యి ఉండొచ్చనుకుంట.







