వయసులో ఉన్నప్పుడు శరీరంలో ఉండే రోగనిరోధకశక్తి వేరు.వయసు పెరిగాక వేరు.30-35 ఏళ్ళ వయసు వచ్చిందంటే చాలు అప్పటివరకు లేని సమస్యలన్ని చుట్టుముట్టేస్తాయి.కొందరు పరీక్షలు చేయించుకోని, సమస్యను మొదట్లోనే కనిపెట్టి చికిత్స మొదలుపెడతారు.
మరికొందరు శరీరంపై సరైన అవగాహన లేక, సకాలంలో సమస్యని కనిపెట్టలేక ప్రాణం మీదకు తెచ్చుకుంటారు.మహిళల విషయానికి వస్తే, కొన్నిరకాల పరీక్షలు ప్రతీ మహిళ ఖచ్చితంగా చేయించుకోవాలి.
బాగానే ఉన్నాం కదా అని శరీరాన్ని ఊరికే వదిలేయకూడదు.
* 20 ఏళ్ళ వయసు దాటిన ప్రతీ అమ్మాయి మళ్ళీ 65 ఏళ్ళు వచ్చేదాకా, ప్రతీ మూడు లేదా అయిదు సంవత్సరాలకోసారి కెర్వికల్ క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలి.
ఇది ఈ మధ్య మహిళల్లో సాధరణంగా కనబడుతోంది.
* 40 ఏళ్లు దాటగానే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవాలి.
మధుమేహం ఒక భయంకరమైన జబ్బైతే, మరే జబ్బు వచ్చినా, షుగర్ ప్రభావం వలన క్యూర్ చేయడం కష్టమైపోతుంది.
* ఋతుక్రమం మొదలైన ఏ స్త్రీ అయినాసరే, పద్ధతైన పీరియడ్స్ కోసం ఓవరీస్ లో సిస్ట్స్ వచ్చాయో లేదో టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి.
* 40 ఏళ్ళు దాటగానే మహిళలు ఓస్టియోపోరోసిస్ కి సంబంధించిన చెకప్ చేయించుకుంటే మంచిది.ఈ ఓస్టియోపోరోసిస్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపించే బోన్ డిజార్డర్.
* 30 ఏళ్లు దాటగానే ఎప్పటికప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.ఎందుకంటే ప్రతీ ఏడాది లక్షలాది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు.