పిచ్చ కోపంగా ఉన్న చంద్రబాబు నాయుడు

కొంతమందిని చూస్తే చంద్రబాబు నాయుడు కి ఒళ్ళు మందిపోతోందట .

తన సొంత పార్టీ లో ఉన్న కొందరు ఎమ్మెల్యే లు నియోజిక వర్గ ఇంచార్జ్ లు ఈయన్ని విసిగించేస్తున్నారు.

ఎన్ని నిధులిచ్చినా - ఎన్ని సార్లు చెప్పినా వారు నియోజకవర్గాల్లో తిరగకుండా - పనులు చేయకుండా - ప్రజల్లోకి వెళ్లకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నది ఆయన కోపం.తాజాగా ఆయన తన కోపాన్ని పార్టీ సీనియర్ నేతల ముందు కూడా వెల్లగక్కారు.

పార్టీ అభివృద్ధికి ఇటీవల నియమించిన పదిమంది సభ్యులతో చంద్రబాబు బుధవారం భేటీ అయినప్పుడు చర్చంతా ఎక్కువగా ఎమ్మెల్యేల పనితీరుపైనే సాగింది.ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి - అసహనం కనబరిచారని చెబుతున్నారు.

ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి ఇటీవల జరిపించిన సర్వేల వివరాలు ఈ భేటీలో చర్చకొచ్చాయి.కనిష్టంగా ఒక ఎమ్మెల్యేకు 17 మార్కులు వస్తే గరిష్ఠంగా మరో ఎమ్మెల్యేకు 74 మార్కులు వచ్చాయి.20 నుంచి 30 శాతం మార్కులు వచ్చిన వారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు.‘ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది.

Advertisement

ఇవి అన్ని నియోజకవర్గాలకు సమానంగానే అందుతున్నాయని అటువంటప్పుడు ఎమ్మెల్యేలపై ఎందుకు ప్రజలు అసంతృప్తితో ఉన్నార’ని చంద్రబాబు ప్రశ్నించారు.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఎమ్మెల్యేలు విఫలమయ్యారని చంద్రబాబు సీరియస్ అయ్యారట.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు