గర్భిణీ స్త్రీలు స్ట్రెస్ కి గురి కాకూడదంటే ఏం చేయాలి?

ఓ వయసులోకి వచ్చాక, అమ్మాయిల్లో మూడ్ స్వింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది.ఇదంతా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన జరుగుతుంది.

 How Should Pregnant Ladies Overcome Stress-TeluguStop.com

గర్భం ధరించాక ఈ మూడ్ స్వింగ్ మరింత పెరిగిపోతుంది.ఒత్తిడిగా అనిపించడం, ఆందోళనకు గురవడం, చికాకు .ఇలాంటి మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి.వీటినుంచి తప్పించుకోవాలంటే గర్భిణీ స్త్రీలు కొన్ని పద్ధతులు పాటీంచాలి.

* గర్భం ధరించగానే నొప్పుల భయం మొదలవుతుంది.ప్రసవం ఎలా అవుతుందో ఏమో, నొప్పులు ఎలా ఉంటాయో ఏమో అనే భయం మొదటినుంచి ఉంటే స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది.

ఆ భయాలు పక్కనపెట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

* గర్భంతో ఉన్న స్త్రీలకు పాదాలు వాస్తుంటాయి.

అలాంటప్పుడు పాదాలు ఎత్తులో ఉంచుకోవడం మంచిది.స్త్రెస్ గా అనిపించదు.

* గర్భిణీ స్త్రీలు చేయగలిగే చిన్నపాటి వ్యాయామాలు కొన్ని ఉంటాయి.డాక్టరుని సంప్రదించి వాటి గురించి తెలుసుకోని, వ్యాయామం చేయాలి.

దాంతో శరీరం, మనసు .రెండూ రిలాక్సేషన్ ని పొందుతాయి.

* ఎప్పుడూ ఒకేచోట కూర్చోని ఏదోకటి ఆలోచించకుండా, కాస్త చల్లగాలికి నడుస్తూ ఉండాలి.తేలికైన నడక స్ట్రెస్ ని పోగొడుతుంది.

* గర్భిణీ స్త్రీలు ఎప్పుడూ ఒంటరితన్నాన్ని ఫీల్ అవకూడదు.దానికి భర్త సహకారం ఎంతో అవసరం.

ఆ సమయంలో కబుర్లు పెట్టడానికి భర్తను మించినవారు లేరు.కాబట్టి, భాగస్వాములు ఒకరితో ఒకరు సమయాన్ని గడపాలి.

* చిన్నపిల్లలతో ఆడుకోవడం మంచిది.దీనివలన మనసెప్పుడు పాజిటివ్ గా, ఉల్లాసంగా ఉంటూ, కడుపులోని బిడ్డ ఎప్పుడూ బయటకి వస్తుందా, ఎప్పుడూ తనతో ఆడుకుందామా అనే పాజిటివ్ భావనలు పెరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube