అపడెప్పుడో శక్తిమాన్ లాగే బిల్డింగ్ మీదనుంచి ఎగరాలని ప్రయత్నించారట పిల్లలు.రజినీకాంత్ సిగరేట్ కాలిస్తే ఇమిటేట్ చేసే పిల్లలు కూడా ఉన్నారు.
ఇక మహేష్ బాబు రాయల్ స్టాగ్ కి బ్రాండ్ అంబాసిడర్ కావడంతో మద్యానికి బానిస అయిపోయానని, మహేష్ మీద కేసు వేసిన అభిమాని కూడా ఉన్నాడు.
అలోచన పెద్దగా లేని లేని వయసులో ఇంతే.
అది సినిమా, సీరియల్, షో .ఏదైనా కావచ్చు.ఒక దృశ్యమాధ్యమం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడమే కాదు, చెడు విషయాలకి త్వరగా అలవాటు అయిపోతారు పిల్లలు, టీనేజర్స్.ఈ సినిమాల వలన పిల్లలు చెడిపోతున్నారని ప్రముఖ మానసిక నిపుణుడు అంబుదురై అభిప్రాయపడ్డారు.
” పిల్లల కోసం రూపొందించే అనిమేషన్ సినిమాల కథాంశాలు కూడా హింసాత్మకంగా ఉంటున్నాయి.కార్టున్ అయినా, ఒక కార్టూన్ మరో కార్టూన్ మరో కార్టూన్ తో గొడవపడటం, చంపడం .ఇవి వారు కార్టూన్ సినిమాల్లో చూపించేవి.చెంగల్ పేట్ పిల్లల స్పెషల్ హోమ్ లో కొందరు అబ్బాయిలు “మారి” సినిమాలో ధనుష్ సిగరేట్ తాగినట్టు ధూమపానం చేయడం అలవాటు చేసుకున్నారు.
రోజు రోజుకి పిల్లల్లో హింసాత్మక ధోరణి పెరిగిపోతుంది.దీనికి సినిమాల్ని తప్పక నిందించాల్సిందే.ఎందుకంటే సినిమాతారలే వారికి గురువుల లాగా అయిపోయారు.పిల్లలు అంతే, ఏదైనా సరే, అలోచనతో కాకుండా, చూపుతో నేర్చుకుంటారు.
మంచి, చెడు మధ్య తేడా పెద్దవాళ్ళు చెబితెనే వారికి తెలిసేది” అంటూ చెప్పుకొచ్చారు అంబుదురై.