వాస్తవాలకు భిన్నంగా తప్పుడు వార్తలు ప్రచురించిందంటూ సాక్షి పేపర్‌పై కేసు రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల కాపు ఉద్యమ సమయంలో రైలు దహనం చేసిన వారిపై కేసులు ఎత్తివేయాలంటూ మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం స్వగృహంలో దీక్ష, ఆపై పోలీసుల అరెస్టు, రాజమండ్రి ఆసుప్రతికి తరలింపు ఆస్పత్రిలో ఉన్న సమయంలో వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌కు విరుద్ధంగా వార్తలు ప్రచురించి, ్రపజలలో ఆందోళనలకు తెరలేపిందని, ఇది శాంతి భధ్రతలకు విఘాతం కలిగించే అంశమేనంటూ పోలీసులు కేసు నమోదు చేసారు.
తప్పుడు వార్తలుతో కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ్రపయత్నించారంటూ ఐపీసీ 153(ఏ) కింద సాక్షి ఎడిటర్, రెసిడెంట్ ఎడిటర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు
కాగా ఈ అంశంపై మంగలవారం హడావిడిగా సమావేశమైన జిల్లా జర్నలిస్టు సంఘాలు, వార్తాంశాల ్రపచురణతోనే శాంతికి విఘాతం కలిగినట్టు పోలీసులు భావించడం శోచనీయమని, తక్షణం కేసులు ఉపసంహరించుకోకుంటే ఆందోళన బాట పడతామని పోలీసులకు హెచ్చరించారు.







