నాజుకు నడుము సుందరి ఇలియానా మళ్ళీ హిందీ ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమైంది.ఈ అమ్మడు అక్షయ్ కుమార్ సరసన నటించిన రుస్తోం ట్రైలర్ ఈరోజే విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది.
ఇలియానా అందానికి కూడా మంచి మార్కులు పడుతున్నాయి.ఈ సినిమా హిట్ అవ్వడం ఇల్లి బేబికి చాలా ముఖ్యం.
ఇది తప్పితే, అజయ్ దెవగణ్ తో మరొక్క సినిమా మాత్రమే మిగిలి ఉంది ఇలియానా చేతిలో.
ఇక హృతిక్ రోషన్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.
ఇప్పటికిప్పుడు తన కెరీర్ కి వచ్చే పెద్ద ప్రమాదం ఏమి లేకపోయినా, ఒకప్పుడు ఖాన్ త్రయానికి చెమటలు పట్టించిన హృతిక్ ఇప్పుడు చాలా వెనుకబడిపోయాడు.బాధాకరమైన విషయం ఏమిటంటే, హృతిక్ కొత్త సినిమా మొహెన్జోదారో ట్రైలర్ కి విపరీతమైన నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది.
బాహుబలితో పోల్చుతూ ఈ సినిమా పరువు తీస్తున్నారు నెటిజన్లు.ఇలాంటి తరుణంలో పునర్వైభవం అందుకోవాలంటే హృతిక్ భారి హిట్ అందుకోవాలి.
ఇక ఇటు ఇలియానా నటించిన రుస్తోం, అటు హృతిక్ నటించిన మొహెన్జోదారో .రెండూ కూడా ఆగస్టు 12న బాక్సాఫీస్ బరిలో పోటిపడనున్నాయి.ఎవరి కెరీర్ ఏ దిశను తీసుకుంటుందో ఆరోజు.