అభిమాని లేనిదే హీరో లేడు అంటారు.స్టార్ హీరో సినిమా వస్తోందంటే బ్యానర్లు కడతారు, అభిషేకాలు చేస్తారు, సినిమా ఆడితే సంబరాలు చేస్తారు, ఆడకపోతే డబ్బులు పెట్టి సినిమాని 50 రోజులు ఆడిస్తారు.
బేసిగ్ గా అభిమానులంటే పిచ్చొళ్ళు.హీరో అంటే పిచ్చి, ప్రేమ, రెండూ కలిపి పిచ్చిప్రేమ ఉంటుంది.
మరి తన స్టార్ డమ్ కి కారణమైన అభిమానులని హీరో కూడా బాగా చూసుకోవాలి కదా.ఆ విషయంలో తారక్ మంచి మనసు గురించి ఎంత మాట్లాడినా తక్కువే.
సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల నలువైపుల నుంచి అభిమానులు వస్తూ ఉంటారు.వారికి కావాల్సింది హీరోతో కొన్ని సెకన్ల పాటు గడిపే అవకాశం.జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి అభిమాన హీరోతో ఓ ఫోటో కావాలి.అభిమానుల ఇంత చిన్ని కోరికపై కూడా ఆంక్షలు విధించే హీరోలు ఉన్నారు మన ఇండస్ట్రీలో.
అలాంటిది ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సెట్లో వేలమంది అభిమానులకి ఫోటోలు ఇచ్చాడు.
గత నెలరోజుల్లో దాదాపు 12వేల ఫోటోలు ఇచ్చాడట ఎన్టీఆర్.
అంటే అభిమానులు వేలల్లో వస్తూ ఉన్నారు అన్నమాట.ఒక రోజైతే ఏకంగా 700 ఫోటోలు ఇచ్చాడట.
షూటింగ్ లో పాల్గొంటూ ఇలా ఫోటోలు ఇవ్వాలంటే, ఎంత ఓపిక ఉండాలి తన శరీరంలో.అభిమానులంటే ఎంత ప్రేమ ఉండాలి తన మనసులో.







