లంగ్ క్యాన్సర్‌ లక్షణాలు ఇవి... జాగ్రత్త

గత దశాబ్దకాలంలో లంగ్ క్యాన్సర్ తో మరణించేవారి సంఖ్య చాలావరకు పెరిగింది.ఇందులో ఒక విచిత్రమైన నిజం ఏమిటంటే అందులో 35% మందికి చావు దగ్గరికి వచ్చేదాకా ఇలాంటి జబ్బు వచ్చిందని తెలియట్లేదట.

 Important Symptoms And Signs Of Lung Cancer Details, Lung Cancer, Lung Cancer S-TeluguStop.com

కాని ఈ వ్యాధి లక్షణాలు చాలా సందర్భాల్లో బయటపడతాయి.ఆ లక్షణాలు ఏంటో తెలియకే నష్టపోతున్నారు చాలామంది.

మరి లంగ్ క్యాన్సర్‌ లక్షణాలు ఏంటో ఈరోజు చూద్దాం.

* దగ్గు లంగ్ క్యాన్సర్‌ యొక్క ప్రధాన లక్షణం.

ఏదో ఇంఫెక్షన్ వలన వచ్చిన దగ్గైతే ఒకటి, రెండువారాలు ఉంటుంది.కాని రోజంతా దగ్గకపోయినా, రోజూ దగ్గతుంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించండి.

* అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా లంగ్ క్యాన్సర్ యొక్క లక్షణం.క్యాన్సర్ సెల్స్ మీ బలాన్ని వాడుకోవడం వలన ఇలా జరుగుతుంది.కాబట్టి బరువు కూడా రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలి.

Telugu Cancer, Cough, Lung Cancer, Lungcancer, Problems-Telugu Health

* ఒంటినొప్పులు రాత్రిపూట రావడం, కండరాల్లో, ఎముకల్లో నొప్పిగా అనిపించటం కూడా ఈ వ్యాధి లక్షణాల్లో ఒకటి.

* గొంతులో మార్పు రావడం, మాటలో అదోరకమైన తేడా ఉండటం.జలుబు లేకున్నా ఇలా జరిగితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.

* ఛాతి నొప్పి, వెన్నునొప్పి, బాహువుల్లో నొప్పి తరచుగా వస్తే అనుమానపడాల్సిందే.

* శరీరానికి కష్టం కలిగించిన పని ఏదైనా చేయగానే ఊపిరి సరిగా ఆడకపోవడం.

శ్వాస తీసుకోవడంలో మార్పు కనిపించినా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా టెస్టులు చేయించుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube