అమరావతికి అంతా త‌ర‌లాల్సిందే.....

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు ఈ నెల 27వ తేదీ నుంచి సాంకేతికంగా అమరావతి నుంచే పాలన కొనసాగించేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్‌ టక్కర్ మీడియాకు తెలిపారు.

 Ap Employees Must Attend From 27th @ Amaravati-TeluguStop.com

శుక్ర‌వారం సచివాలయ ఉద్యోగులు ఆయ‌న‌ని క‌ల్సి అమరావతికి ఉద్యోగుల తరలింపును వాయిదా వేయాలని కోరారు.

తదుప‌రి ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే 50 హెచ్‌ఓడీలను రాజధానికి తరలించామని, మిషనరేట్లు, డైరక్టరేట్లు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడ, గుంటూరులకు తరలించి పాల‌న సాగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.

ఇప్ప‌టికీ జాప్యం జ‌రిగింద‌న్న భావ‌న ప్ర‌జ‌ల‌లో నెల‌కొని ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని, ఈ క్ర‌మంలోనే రాజ‌ధాని నుంచి పాల‌న సాగించాల‌న్న ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగానే ఎవ‌రైనా ప‌ని చేయాల్సి ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు.

ఉద్యోగుల తరలింపునకు మరో రెండు నెలలు పట్టే అవ‌కాశాలున్నాయ‌ని, విజయవాడ, గుంటూరులలో రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రయోగిస్తామని , ఈ విష‌యం ఉద్యోగులకు ఇప్ప‌టికే తెలిపినందున‌, రాజ‌ధానికి త‌ర‌లి రావాల‌ని సూచించారు.

కాగా వచ్చే నెల 27వ తేదీ నాటికి సెక్రటేరియట్ ఉద్యోగులంతా అమరావతికి రావల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవ‌ల జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో స్ప‌ష్టం చేయ‌టంతో సచివాలయ ఉద్యోగులు త‌మ ఆందోళ‌న‌ల‌ను వృద్ధుతం చేసారు.

వ‌స‌తులు లేకుండా రాజ‌ధానిలో అడుగు పెట్ట‌బోమ‌ని భీష్మంచే అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని, ఉద్యోగుల‌ను రెచ్చ‌గొడుతున్న వారి ప‌ని ప‌డ‌తానంటూ సిఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో రాజ‌ధానికి త‌రలాల్సిన ఉద్యోగుల సమస్య‌లపై శనివారం ప్ర‌త్యేక స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube