బ్రేక్ ఫాస్ట్ చేయడం మరచిపోవద్దు - కష్టాలు కొనితెచ్చుకోవద్దు

బ్రేక్ ఫాస్ట్ అనేది ఒక ఆంగ్ల పదం.దానర్థం బ్రేక్ ది ఫాస్ట్.

 Never Skip Your Breakfast-TeluguStop.com

అంటే ఉపవాసాన్ని ఆపేయడం.అలా ఎందుకు అన్నారంటే , రాత్రి తిన్నాక, ఓ గంటకి పడుకున్నా (పడుకోవడానికి మూడు గంటల ముందు తింటే ఆరోగ్యకరం) , కనీసం 8-9 గంటల విరామం వస్తుంది.

ఈ విరామం ఉపవాసం కింద లెక్కే.అందుకే లేచాక రెండుగంటల్లో బ్రేక్ ఫాస్ట్ కానిచ్చేయాలి.

లేదంటే చాలా నష్టాలు ఉన్నాయి.

కొందరికి ఉదయం 10-11 దాటితే కాని మెలుకువ రాదు.

అది ఏమాత్రం మంచి అలవాటు కాదు.ఎందుకంటే అలాంటివారు బ్రేక్ ఫాస్ట్ మిస్ అయిపోతున్నారు.

డైరెక్ట్ గా లంచ్ తో తమ తిండిని మొదలుపెడతారు.మీ కడుపు ఎక్కువ సమయం ఉపవాసం చేసినట్టే.

బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే, మీ శరీరానికి అవసరమైనంత శక్తి లభించదు.ఎందుకంటే సరిపడా కాలరీలు మీ బాడిలోకి చేరవు గనుక.

అందుకే మత్తుగా ఉండటం, నిద్రలోకి జారుకోవడం, సాయంత్రం అవగానే అలసిపోవడం జరుగుతాయి.

బ్రేక్ ఫాస్ట్ ని దాటేసినా కొద్ది, మన జీర్ణక్రియ దెబ్బ తింటుంది.

అలాగే కడుపులో మంట.అల్సర్ లాంటి ప్రమాదాలు తప్పవు .అలాగే మన జీవక్రియ దెబ్బతిని, కాలరీలు సరిగా ఖర్చవక, శరీరం లావేక్కే ప్రమాదం ఉంటుంది .ఆకలి పెరిగిపోతూ ఉంటుంది.దానితో లంచ్, డిన్నర్ లో తినే ఆహారాన్ని పెంచుకోవాల్సి వస్తుంది.ఇది శరీరం యొక్క బ్యాలెన్స్ ని దెబ్బతీస్తుంది.

అందుకే, నాలుగు ఇడ్లీలే కదా అని బ్రేక్ ఫాస్ట్ ని తీసివెయొద్దు.ఉపవాసాన్ని తగ్గించి, ప్రతీరోజు బ్రేక్ ఫాస్ట్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube