అల్లు అర్జున్ కి తప్పిన ప్రమాదం

సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకోవాలని వచ్చి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ లిఫ్ట్ లో చిక్కుకోవడంతో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.ఈ ఉదయం సింహాచలానికి వచ్చిన అల్లు అర్జున్, కొంతమంది అభిమానులు, పోలీసుల భద్రత మధ్య ఆలయానికి వచ్చారు.

 Allu Arjun Irks In Lift-TeluguStop.com

అక్కడి లిఫ్ట్ లో ఎక్కిన వేళ, రెండు అంతస్తుల మధ్య లిఫ్ట్ ఆగిపోయింది.ఆ వెంటనే స్పందించిన ఆలయ అధికారులు, లిఫ్ట్ తలుపులను బలవంతంగా తెరిచి అల్లు అర్జున్ ను బయటకు తీసుకు వచ్చారు.

ఆపై ఆయన స్వామివారి దర్శనానికి వెళ్లారు.

లిఫ్ట్ కెపాసిటీకి మించి బరువు పెరగడం వల్లే అది ఆగిపోయిందని సమాచారం.

ఈ ఘటనతో అల్లు అర్జున్ ను చూసేందుకు గుడి వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చిన మెగా అభిమానులు కొంత ఆందోళనకు గురయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube