అవినీతి ఆరోపణలు ఉన్నా దీదీ ఘన విజయం

వెస్ట్ బెంగాల్ ప్రజలు దీదీకి మరోసారి ఘనవిజయం కట్టబెట్టారు.మమత ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా జనం పట్టించుకోలేదు.

 Didi Set To Win In West Bengal-TeluguStop.com

రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని విమర్శలు చెలరేగినా ప్రజలు ఖాతరు చేయలేదు.గత ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించారు.

మమతను మట్టి కరిపించాలని కమ్యూనిస్థులు, కాంగ్రెస్ తమ శత్రుత్వాన్ని మర్చిపోయి, సిద్ధాంతాలను పక్కకు పెట్టి పోటీ చేసినా మమత విజయాన్ని ఆపలేకపోయారు.ప్రతిపక్షాలు చేసిన అవినీతి ఆరోపణలను సామాన్య ప్రజలు నమ్మలేదని మమత అన్నారు.

బెంగాల్లో శారదా చిట్ ఫండ్ కుంభ కోణం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube