గత ఏడాది కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన గోవా సెయింట్ క్రూజ్ ఎమ్మెల్యే అటానాసియో మోన్సిరేట్ కొన్ని రోజుల క్రితం అత్యాచారం ఆరోపణలపై విచారణ ఎదుర్కున్న సంగతి తెలిసిందే.
ఆధారాలు లభించడంతో ఆయనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
అయితే సదరు ఎమ్మెల్యేకి కోర్టులో ఊరట లభించింది.ఆయనకు లక్ష రూపాయల పూచీకత్తుతో గోవా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిన మైనర్ బాలిక ఆచూకిని కనుగొన్న పోలీసులకు సదరు బాలిక తనను సెయింట్ క్రూజ్ ఎమ్మెల్యే అటానాసియో మోన్సిరేట్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది.దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి ఆయనను కోర్టులో హాజరుపరిచారు.







