తెలంగాణలో తన పార్టీని పూర్తిగా కోల్పోయిన వై కా పా అధినేత జగన్ ఇక పూర్తిగా తెగించారు.సీఎం కెసీఆర్ మీద విమర్శల జడివాన కురిపించారు.
తెలంగాణా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా కర్నూలులో మూడు రోజుల జల దీక్షను ప్రారంభించిన జగన్ ఘాటుగా మాట్లాడారు.ఆంధ్రలో ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్న సమయంలో కెసీఆర్ ప్రాజెక్టులు కడుతున్నారని, ఆయనకు ఆంద్ర ప్రజల ఉసురు తగులుతుందని విమర్శించారు.
రెండు రాష్ట్రాలు కలిసి కర్నాటక, మహారాష్ట్ర నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల గురించి పోరాడాలని, కానీ కెసీఆర్ అలా చేయకుండా తానూ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించడం అన్యాయమని అన్నారు.హైదారాబాదును గుంజుకున్నారని, ఇప్పుడు నీటిని కూడా హుంజుకుంటే ఎలా ప్రశ్నించారు.
కెసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అది మానుకోవాలని హెచ్చరించారు.ఆయన హిట్లర్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
తెలుగు రాష్ట్రాలు ఇండియా, పాకిస్తాన్ మాదిరిగా కాకూడదని అన్నారు.మొత్తం మీద జగన్ గతంలో ఎన్నడూ లేనంత ఘాటుగా మాటల తూటాలు విసిరారు.
దీనిపై తెలంగాణా నాయకులు తీవ్రంగానే స్పందించే అవకాశం ఉంది.







