8 నెలల పసిపాప నోబెల్ రికార్డ్.. నెటిజన్స్ ప్రశంసలు..!

8 నెలల వయస్సులో ఉన్న పసిపాప అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేయడం, తల్లిదండ్రులను కూడా సరిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉండడం మనందరికీ తెలిసిందే.కానీ ఓ 8 నెలల చిన్నారి నోబెల్ ప్రపంచ రికార్డు( Nobel World Record ) బుక్ లో స్థానం సంపాదించి అందరిని ఆశ్చర్యపరిచింది.

 8-month-old Baby Nobel Record Netizens Praise , Nobel World Record, Malkajigiri-TeluguStop.com

ఆ పసిపాపకు సంబంధించిన వివరాలు ఏమిటో.ఆ పసిపాప సాధించిన ఘనత ఏమిటో తెలుసుకుందాం.

హైదరాబాద్ లోని మల్కాజిగిరి బలరాం నగర్( Malkajigiri Balaram Nagar ) లో నివాసం ఉంటున్న మణికంఠ, లక్ష్మీ ప్రసన్న( Manikantha, Lakshmi Prasanna ) దంపతులకు ఆద్యశ్రీ అనే 8 నెలల చిన్నారి సంతానం. ఆద్యశ్రీ ( Adyashri )పుట్టినప్పటి నుండి ఎంతో యాక్టివ్ గా ఉంటోంది.

కేవలం రెండు నెలల వయసు రాగానే ఈ చిన్నారికి అద్భుతమైన గ్రహకశక్తి ఉందనే విషయాన్ని ఈమె తల్లిదండ్రులు గ్రహించారు.ఒక తల్లిదండ్రులు ఆ చిన్నారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.

చిన్నారికి మూడు నెలల వయస్సు రాగానే ఫోటోలు, రకరకాల వస్తువులు, దేశాలకు సంబంధించిన జెండాలను గుర్తించడంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.ఇక క్రమంగా పాపకు వస్తువులను గుర్తుపట్టడం, ఫోటోలను గుర్తించడం అలవాటు అయింది.

Telugu Adyashri, General, Latest Telugu, Manikantha, Nobel-Latest News - Telugu

ఆద్యశ్రీకి ప్రస్తుతం ఎనిమిది నెలల వయస్సు.ప్రస్తుతం పాప గ్రహక శక్తిని చూసి తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు.ఆద్యశ్రీ 300 రకాల ఫోటోలను గుర్తించగలుగుతుంది.కూరగాయలు, పళ్ళు, పూలు, వివిధ రకాల వస్తువులను సులభంగా గుర్తించగలుగుతుంది.అంతేకాకుండా 30 దేశాలకు చెందిన జాతీయ జెండాలను సైతం గుర్తుపడుతోంది.ఇక ఆద్యశ్రీ తల్లిదండ్రులు పాప గ్రహక శక్తిని రికార్డ్ చేసి నోబెల్ ప్రపంచ రికార్డు కోసం పంపారు.

చిన్నారి గ్రహకశక్తికి నోబెల్ ప్రపంచ రికార్డు బుక్ లో స్థానం దొరికింది.అంతేకాదు వివిధ రకాల సంస్థల నుండి ఈ చిన్నారికి పలు అవార్డులు, మెడల్స్ కూడా వచ్చాయి.

ఇంత చిన్న వయస్సులోనే నోబెల్ రికార్డు రావడం చాలా సంతోషంగా ఉందని తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube