అక్రమంగా అమెరికాలోకి ప్రవేశం, అరెస్ట్: కస్టడీ నుంచి ఏడుగురు భారతీయులకు విముక్తి, కానీ..!!

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి.గతవారం యూఎస్- కెనడా సరిహద్దుల్లో అరెస్ట్ అయిన ఏడుగురు భారతీయులను యూఎస్ బోర్డర్ సెక్యూరిటీ పోలీసులు కస్టడీ నుంచి విడుదల చేశారు.

అయితే వారిని అమెరికా నుంచి బయటకు పంపే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు యూఎస్ బోర్డర్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.

ఏడుగురు భారతీయుల్లో ఆరుగురిని ఆర్డర్ ఆఫ్ సూపర్‌విజన్ కింద వుంచామని, ఒకరిని మానవతా దృక్పథంతో ఆర్డర్ ఆఫ్ రికగ్నిసెన్స్‌పై విడుదల చేసినట్లు ప్రకటించారు.ఈ కేసుకు సంబంధించి యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తదుపరి చర్యలు తీసుకోనుంది.

కాగా.ఏడుగురు భారతీయులను గతవారం అమెరికా - కెనడా సరిహద్దుల్లో యూఎస్ అధికారులు పట్టుకున్నారు.

Advertisement

దీనికి సంబంధించి స్టీవ్ శాండ్ (47) అనే వ్యక్తిపై మానవ అక్రమ రవాణా అభియోగాలు మోపారు.జనవరి 19న యూఎస్- కెనడా సరిహద్దుకు దక్షిణంగా ఒక మైలు దూరంలో మిన్నెసోటా- నార్త్ డకోటాల మధ్య శాండ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అతను 15 మంది ప్రయాణికులతో వున్న వ్యాన్‌ను నడుపుతూ అమెరికాలోకి వారిని అక్రమంగా చేరవేస్తున్నాడు.ఈ నేపథ్యంలో శాండ్.

ఇద్దరు భారతీయులను నార్త్ డకోటాలోని పెంబినా బోర్డర్ పెట్రోల్ స్టేషన్ వద్ద దించగా.మరో ఐదుగురు భారతీయులను లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అడ్డుకున్నారు.

వీరిలాగే అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలని యత్నించిన నలుగురు సభ్యుల భారతీయ కుటుంబం యూఎస్- అమెరికా సరిహద్దుల్లో మరణించిన సంగతి తెలిసిందే.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా.ఇంత వరకు మృతులు ఎవరన్నది గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కు తెరదించారు కెనడా అధికారులు.

Advertisement

ఆ న‌లుగురి మృత‌దేహాల‌ను పోలీసులు గుర్తించారు.వీరు భార‌త్‌లోని గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన‌వారిగా తేల్చారు.

గ‌త కొన్ని రోజుల నుంచి ఆ కుటుంబం కెన‌డాలో సంచరిస్తున్నట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.అయితే అమెరికా సరిహద్దుల వ‌ద్ద‌కు వాళ్ల‌ను ఎవ‌రు తీసుకువ‌చ్చార‌న్న‌ది మాత్రం తేలలేదు.

మాన‌వ అక్ర‌మ ర‌వాణా కేసుగానే దీనిని భావిస్తున్నారు.జనవరి 12, 2022న వీరి కుటుంబం టొరంటోకు చేరుకుందని.

అక్కడి నుంచి జనవరి 18న ఎమర్సన్‌కు వెళ్లారని కెనడా పోలీసులు చెబుతున్నారు.మృతులను జ‌గ‌దీశ్ బ‌ల్దేవ్‌భాయ్ ప‌టేల్‌(39), వైశాలీబెన్ జ‌గ‌దీశ్‌కుమార్ ప‌టేల్‌(37), విహంగి జ‌గ‌దీశ్‌కుమార్ ప‌టేల్‌(11), ధార్మిక్ జ‌గ‌దీశ్‌కుమార్ ప‌టేల్‌(3)గా గుర్తించారు.

వీరంతా ఒకే కుటుంబానికి చెందిన‌వాళ్లు.కెన‌డా-అమెరికా బోర్డ‌ర్‌కు 12 మీట‌ర్ల దూరంలో ఉన్న మానిటోబాలోని ఎమ‌ర్స‌న్ వ‌ద్ద ఆ న‌లుగురి మృత‌దేహాల‌ను గుర్తించారు.

వీరిది గుజ‌రాత్‌లోని కలోల్ స‌మీపంలోని దింగుచా గ్రామం.జ‌న‌వ‌రి 26వ తేదీన మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వ‌హించిన‌ట్లు కెన‌డా అధికారులు పేర్కొన్నారు.

తీవ్రమైన చలి, ప్రతికూల వాతావరణ పరిస్ధితుల కారణంగానే ఆ న‌లుగురు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.వీరి మరణవార్తను కెనడా అధికారులు.

భారత్‌లోని బంధువులకు తెలియజేశారు.

" autoplay>

తాజా వార్తలు