బంగ్లాదేశ్ లో వారం రోజులు లాక్ డౌన్..!

ప్రపంచవ్యాంతంగా మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.కరోనా తీవ్రత తగ్గిందని తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటున్నారు.

అలాంటి వారికి కరోనా ఎఫెక్ట్ పడుతుంది.భారత్ లో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.

ఇదిలాఉంటే బంగ్లాదేశ్ లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయట.అందుకే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు బంగ్లాదేశ్ లాక్ డౌన్ విధించారు.

వైరస్ ను కట్టడి చేసేందుకు బంగ్లాదేశ్ లో సోమవారం నండి ఏడు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు రోడ్లు, రవాణా శాఖా మంత్రి ఒబైదుల్ ఖాదర్ తెలిపారు.లాక్ డౌన్ లో కొన్నిటికి వెసులుబాటు ఇస్తున్నట్టు చెప్పారు.

Advertisement

అత్యవసర సర్వీసులు, పరిశ్రమలను లాక్ డౌన్ నుండి మినహాహిస్తున్నట్టు ప్రకటించారు.అక్కడ కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ పనిచేయాలని అన్నారు.బంగ్లాదేశ్ లో శుక్రవారం రోజు అత్యధికంగా 6,830 కొత్త కేసులు వచ్చాయి.50 మంది మృతి చెందారు.అందుకే అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.

బంగ్లాదేశ్ లోనే కాదు ఈస్టర్ సందర్భంగా కరోనా కేసులు పెరగకుండా ముందు జాగ్రత్తగా ఇటలీలో కూడా మూడు రోజుల లాక్ డౌన్ ప్రకటించింది.సోమవారం వరకు దేశంలో అన్ని ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు