ప్రస్తుత కాలంలో చదువు కంటే కూడా లోకజ్ఞానం ఉన్నవారే ఎంతో అద్భుతంగా బతుకుతున్నారు.చదువుకున్న వారు ఉద్యోగం అంటూ ఒకరి కింద పని చేయడానికి వెళ్తారు తప్ప సొంతంగా పని చెయ్యాలని అనుకోరు.
కానీ లోకజ్ఞానం తెలిసినవాడు సొంతంగా పని చేసి మరికొందరికి జీవనాధారం చూపిస్తుంటారు.ఇక అలానే పదో తరగతితో చదువు ఆపేసిన 68 ఏళ్ళ వృద్ధురాలు లక్షలు లక్షలు సంపాదిస్తుంది.
ఎలా సంపాదిస్తుంది? ఎంత సంపాదిస్తుంది అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఉత్తరప్రదేశ్ లోని కన్నౌగ్ గుందా ప్రాంతానికి చెందిన కిరణ్ రాజ్ పుత్ అనే 68 ఏళ్ల వృద్ధురాలు ఏడాదికి 25 లక్షల రూపాయలకుపైగా సంపాదిస్తుంది.ఆమెకు ఉన్న 25 బిగాయాల వ్యవసాయ భూమిని ఆమె దీవిగా మార్చేశారు.
ఆ ప్రాంతం మొత్తాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చేశారు.పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయంతో ఆమె చేపలను, పండ్లను పెంచి ఎంతో ఆదాయం సంపాదిస్తున్నారు.
ఇక ఆ దీవిలో బోటింగ్ చేయడానికి ఎంతో ఉత్సాహం కనబరుస్తున్నారు.
ఆమె చేపల చెరువు ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి ఆమెకు 2 లక్షల రూపాయిలు రాగా ఆమె దగ్గర ఉన్న మొత్తం డబ్బుతో పాటు బంధువులు కూడా 11 లక్షలు సేకరించగా ఆమె చేపల చెరువుకు పెట్టుబడిగా పెట్టారు.
అయితే మొదట్లో కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ చివరికి మంచి లాభాలు సొంతం చేసుకుంది.ఇప్పుడు చేపల చెరువు నుంచి 5 నుంచి 7 లక్షల రూపాయిల వరకు లాభం వస్తుంది.
దాదాపు ఏడాదికి 20 నుంచి 25 లక్షల రూపాయిలను సంపాదిస్తుంది.ఇక ఈ వ్యాపారం ఎంతోమందికి నచ్చడంతో అందరూ కూడా ఈ వ్యాపారం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.