పెళ్ళి జరిగిన తరువాత వధువు తన మనవరాలని తెలిసింది

68 ఏళ్ళ పెళ్ళికొడుకు, 24 ఏళ్ళ పెళ్ళి కూతురు.ఇద్దరు ఒక అన్ లైన్ డేటింగ్ సైట్లో ఒకరిని ఒకరు చూసి పెళ్ళి చేసుకున్నారు.

ఇందులో వింత ఏముంది, ఇలా వయసులో చాలా అంతరం ఉన్నా పెళ్ళి చేసుకున్నారనే కథలు ఎన్నో విన్నాం కదా అని అనుకుంటున్నారేమో కాని, అసలు ట్విస్ట్‌ ముందే ఉంది.ఫ్లోరిడాలో ఉంటున్న ఈ ముసలాయనకి అప్పటికే రెండు పెళ్ళి జరిగిపోయాయి.

రెండో భార్య దగ్గర విడాకులు తీసుకున్న తరువాత ఏదో అద్భుతంలా అదృష్టం వరించి 7 మిలియన్ డాలర్ల లాటరీ తగిలింది ఈయనగారికి.ఇంకేం, మిలినియర్ అయిపోయాడు.

మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనిపించింది.వెంటనే ఆన్ లైన్ డేటింగ్ సైట్లో ఓ అమ్మాయిని చూసాడు, మనసు పారేసుకున్నాడు.

Advertisement

క్యాష్ పార్టీ కావడంతో ఆ అమ్మాయి కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పెళ్ళికి ఒప్పేసుకుంది.ఇద్దరు పెళ్ళి చేసుకున్నారు.

ఓరోజు ముసలాయన తన పాత ఫోటోలున్న ఓ ఆల్బమ్ చూపిస్తోంటే, ఆ ఫోటోల్లో ఉన్న ఓ టీనేజ్ కుర్రాడి వైపు అదోలా చూసింది అమ్మాయి.పరిశీలించి చూస్తే ఆ కుర్రాడు ఎవరో కాదు, టీనేజ్ లో ఉన్న తన తండ్రీ ఫోటో అది.ఈ అమ్మాయి తండ్రి ఎవరో కాదు, ఈ ముసలాయనకి, తన మొదటి భార్యకి పుట్టిన కొడుకు.అందుకే ఫోటోల్లో తనతో, తన మొదటి భార్యతో ఉన్నాడు.

అంటే ఇప్పుడు పెళ్ళి చేసుకున్నవారు వరసకి తాత - మనవరాలు అవుతారు.ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే, మొదటిభార్య ఈ ముసలాయనతో తెగదెంపులు చేసుకున్నాక, తన నీడ కూడా పిల్లల మీద పడకూడదని ఏదో దూరప్రాంతంలో పిల్లలని పెంచుకుందట.

అందుకే ఈ తాతయ్య వివరాలు ఆ అమ్మాయికి తెలియవు.పోని, ఈ అమ్మాయి ఏమైనా అమాయకురాలా అంటే అదీ లేదు, టీనేజ్ లోనే ఓ ఎఫైర్ నడిపి, గర్భవతి అయ్యి, అబార్షన్ చేయించుకోని, ఇంట్లోంచి తల్లిదండ్రులు గెంటేసే దాకా తెచ్చుకుంది పరిస్థితి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఆ తరువాత ఆన్ లైన్ ఈ ముసలాయన పరిచయం అవడం, పెళ్ళి జరిగిపోయాక అసలు ట్విస్ట్‌ బయటపడింది.సరే ఇప్పుడు వరసలు తెలిసాయి కదా, తప్పు జరిగిపోయిందని భవించట్లేదు ఈ జంట .ఇద్దరు భార్యభర్తల్లానే కలిసి ఉంటారట.ఏంటోనండి .కలికాలం ఇలాంటివి ఇంకెన్ని చూడాలో!.

Advertisement

తాజా వార్తలు