రోబ్ అనే వ్యక్తికి తన ఇంటి బాత్రూమ్ గోడలో చిప్స్ దొరికాయి.వెంటనే ఉత్సుకతతో వాటిని వాసన చూసి.
రుచి చూసాడు.వెంటనే షాక్ తిన్న విధంగా అయిపోయాడు.
చిప్స్ ఏంటి.? అవి గోడలో దొరకడమేంటని ఆలోచిస్తున్నారా.? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.అమెరికాలోని ఇల్లినోయిస్ కు చెందిన రోబ్ అనే వ్యక్తి.
తన బాత్రూమ్ గోడను రినోవేట్ చేయిస్తున్నాడు.ఈ క్రమంలో మెక్‌డొనాల్డ్స్ ఫుడ్ బ్యాగ్ ఒకటి అతని కంట పడింది.
దాన్ని పరిశీలించి చూడగా.అది 60 ఏళ్ల క్రితందని గుర్తించాడు.
దీంతో ఆశ్చర్యపోయి ఆ ఫుడ్ బ్యాగ్ లో ఏముందా అని తెరిచి చూసాడు.అందులో బంగాళాదుంప చిప్స్ చుట్టూ ఓ కాగితం చుట్టి ఉంది.
అవి చూడడానికి క్రిస్పీ గా కనిపిస్తున్నాయి.దీంతో వాటిని తిని చూడగా అవి ఇంకా క్రిస్పీగా ఉన్నాయని అతడు తెలుసుకున్నాడు.
ఈ విషయాన్ని రోబ్ రెడిట్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు.
1959వ సంవత్సరంలో తమ ఇంటిని కట్టామని.
ఆ సమయంలో ఓ మెక్‌డొనాల్డ్ షాప్ తమకు దగ్గరలోనే ఉండేదని రోబ్ చెప్పుకొచ్చాడు.ఇంటిని నిర్మించే బిల్డర్స్ ఎవరైనా.
ఈ చిప్స్ బ్యాగ్‌ను తీసుకొచ్చి ఉంటారని రోబ్ తెలిపాడు.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా.
దీనిపై నెటిజన్లు పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది ఈ విషయాన్ని కామెడీ అని కొట్టిపారేస్తే.
మరికొందరు 60 సంవత్సరాల క్రిందటి చిప్సా.! అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.