కరెంటు కొరత వల్ల దేశవ్యాప్తంగా చాలాచోట్ల కరెంటు కోతలు విధించాల్సి వస్తోంది.దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా కరెంటు బిల్లులు భారీగా పెంచేస్తున్నాయి.
దీంతో ప్రజలు చౌకగా ఎలక్ట్రిసిటీ అందించే సోలార్ వైపు చూస్తున్నారు.కొందరు ప్రజలు ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి కోసం చిన్నపాటి సోలార్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసేసుకున్నారు.
మరింతమంది ఇదే బాటలో నడుస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఒక వ్యాపారి విశాఖలోని తన హోటల్ మొత్తాన్ని సోలార్ ప్యానెల్స్ తో కవర్ చేశారు.
అయితే విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ఈ ప్యానల్స్ అల్లంత దూరం నుంచి మెరుస్తూ ఉన్నాయి.దీంతో ఈ భవనం చూపరులను కట్టిపడేస్తోంది.
విశాఖపట్నంలోని గురుద్వారా జంక్షన్ వద్ద ఈ మోడర్న్ హోటల్ ను నిర్మించారు.దీనిని 100% గ్రీన్ బిల్డింగ్ గా నిర్మించాలని సదరు ఓనర్ ఆలోచించి దాన్ని పూర్తిగా సోలార్ ప్యానెల్స్ తో కప్పారు.
అవి చూడటానికి ఏదో మోడర్న్ డిజైన్ లాగా కనిపిస్తున్నాయి కానీ నిజానికి అవి రోజుకు 78 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సోలార్ ప్యానల్స్.భవనం కింది అంతస్తు నుంచి పై వరకు చుట్టూ ఉన్న ఈ సోలార్ ఫ్యాన్స్ వల్ల అతనికి చాలా ఎలక్ట్రిసిటీ బిల్లు ఆదా అవుతోంది.

ఈ హోటల్ యజమాని సోలార్ ఎనర్జీని నెట్ మీటరింగ్ ద్వారా వినియోగిస్తున్నారు.తరువాత మిగిలిన విద్యుత్తును గ్రిడ్ కు పంపిణీ చేస్తూ అదనంగా లాభాలు ఆర్జిస్తున్నారు.లుక్ కోసం నలుపురంగు అద్దాలు అందరూ ఏర్పాటు చేస్తుంటారు కానీ ఇతను కొత్తగా ఆలోచించి సోలార్ ప్యానళ్లను బిగించారు.దీని వల్ల కొద్దిగా ఖర్చయినా లుక్ తో పాటు ఎలక్ట్రిసిటీ బిల్లు సేవ్ అవడంతోపాటు అదనపు ఆదాయం వస్తుంది.
ఈ హోటల్ ఓనర్ ఆలోచన విని చాలా మంది ఫిదా అవుతున్నారు.ఇతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎక్కువ కమర్షియల్ బిల్డింగ్స్ సోలార్ ప్యానల్స్ తో రూపుదిద్దుకుంటే మరింత ఎనర్జీని సేవ్ చేయొచ్చు.
అలానే రెగ్యులర్ కరెంటు బిల్లుల భారం తగ్గుతుంది.







