గత రెండు వారాలుగా కాలిఫోర్నియాలో( California ) ఆరు దేవాలయాలను ధ్వంసం చేశారని యూఎస్ కాంగ్రెస్ బరిలో నిలిచిన రితేష్ టాండన్( Ritesh Tandon ) అన్నారు.కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ప్రాతినిథ్యం కోసం పోటీపడుతున్న భారతీయ సంతతికి చెందిన డెమొక్రాటిక్ నేత ఈ టాండన్.
ఈ ఘటనలపై స్టేట్ సెనేటర్ ఐషా వహాబ్( State Senator Aisha Wahab ) నుంచి స్పందన లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తూ రితేష్ రంగంలోకి దిగారు.ఈ మేరకు ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ పెట్టిన ఆయన .గత రెండు వారాల్లో ఆరు భారతీయ దేవాలయాలు ధ్వంసమయ్యాయని చెప్పారు.వీటిలో ఐదు వహాబ్ ప్రాతినిథ్యం వహిస్తున్న డిస్ట్రిక్ట్‌లో వున్నాయని, అయినప్పటికీ సెనేటర్ ఐషా వహాబ్ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.

టాండన్ ఇతర నిరసనకారుల బృందం సమావేశం నిర్వహించాలని కోరుతూ సెనేటర్ వహాబ్ కార్యాలయం ఎదుట ర్యాలీ నిర్వహించారు.వర్కింగ్ డే అయినప్పటికీ కార్యాలయం మూసివేయబడింది.పన్ను చెల్లింపుదారుల డాలర్ల వినియోగం గురించి ఆందోళనలను లేవనెత్తడానికి సైతం టాండన్ ప్రయత్నించారు.వహాబ్ 2022లో కాలిఫోర్నియా సెనేట్‌కు( California Senate ) ఎన్నికయ్యారు.ఆమె వెబ్‌సైట్ ప్రకారం.ఆర్ధిక అసమానతలను తగ్గించడం, సీనియర్ సిటిజన్‌లు, మహిళలు, పిల్లలు, శ్రామిక కుటుంబాల కోసం భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన చట్టసభకర్తగా వహాబ్ తనను తాను నిలబెట్టుకున్నారు.
రాయిటర్స్ ప్రకారం.చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన వహాబ్ స్వయంగా ఫోస్టర్ కేర్‌లో వున్నారు .2018లో హేవార్డ్ సిటీ కౌన్సిల్‌కు ఆమె ఎన్నికయ్యారు.యునైటెడ్ స్టేట్స్‌లో( United States ) ప్రభుత్వ కార్యాలయానికి ఎన్నికైన తొలి ఆఫ్ఘన్ అమెరికన్ మహిళగానూ వహాబ్ నిలిచారు.

కాగా.గతేడాది డిసెంబర్‌లో కాలిఫోర్నియా రాష్ట్రంలోని నెవార్క్ నగరంలో వున్న ప్రఖ్యాత స్వామి నారాయణ్ మందిర్( Swaminarayan Mandir ) గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు.ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది.నేరస్తులను పట్టుకునేందుకు నెవార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రయత్నాలను స్వాగతించింది.మందిరానికి సమీపంలో నివసించే ఒక భక్తుడు.ఆలయం వెలుపలి గోడపై నల్ల సిరాతో హిందూ వ్యతిరేక , భారత వ్యతిరేక గ్రాఫిటీని కనుగొని వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించినట్లు ఆలయ ప్రతినిధి భార్గవ్ పటేల్ తెలిపారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విద్వేష నేరంగా భావిస్తూ దర్యాప్తు ప్రారంభించి ఆలయ వర్గాలతో మాట్లాడారు.







