ఇప్పుడు అంటే డేటింగ్ యాప్స్ తో పాటు టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయింది కాబట్టి ప్రజలు తమకు నచ్చిన వారిని లవర్ గా ఎంపిక చేసుకోగలుగుతున్నారు.కానీ 50 ఏళ్ల క్రితం సుదూర ప్రాంతాల వారితో కమ్యూనికేట్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది.
అప్పుడు యువతకు ఫోన్లు అందుబాటులో లేక చాలా ఇబ్బందులు పడేవారు.ఇక బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ ని వెతుక్కోవడానికి ఆరోజుల్లో అసాధ్యంగా అనిపించేది.
అయితే వారు ఆ రోజుల్లో లవర్స్ ని ఎలా పొందేవారో తాజాగా దొరికిన ఒక లెటర్ చెప్పకనే చెబుతోంది.ఈ లెటర్ ని బాయ్ ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్న ఇద్దరు యువతులు 56 ఏళ్ల క్రితం రాశారు.
ఇంగ్లాండ్‌లోని నార్త్ లింకన్‌షైర్‌లో ఈ లెటర్ దొరికింది.
వివరాల్లోకి వెళితే.
ఇటీవల స్కన్‌థార్ప్ లిట్టర్ పికర్స్ గ్రూప్ నది నీటిలో పాతకాలం నాటి వస్తువులు, వ్యర్ధాలను కలెక్ట్ చేస్తుండగా వీరికి 56 ఏళ్ల నాటి గ్లాస్ బాటిల్ కనిపించింది.అందులో ఒక పేపర్ ఉండగా దానిని ఓపెన్ చేసి చేశారు.
అయితే ఆ పేపర్ కొంచెం కూడా పాడుకాకుండా ఇప్పుడే రాసిన ఫ్రెష్ పేపర్ గా ఉంది.అది చూసి వారు షాక్ అయ్యారు.ఆ లెటర్ లో రాసిన మేటర్ చదివిన తర్వాత వారి ఫ్యూజులు అవుట్ అయ్యాయి.ఎందుకంటే ఇది బాయ్ ఫ్రెండ్స్ ని సెట్ చేసుకోవడానికి ఇద్దరు యువతులు రాసిన లెటర్.
ఆగస్టు 9, 1966న ఇద్దరు అమ్మాయిలు ఈ లేఖను రాసినట్లు అందులో ఉంది.

వారి పేర్లు జెన్నిఫర్ కోల్‌మన్, జానెట్ బ్లాంక్లీ అని అందులో రాసి ఉంది.తమకు బాయ్‌ఫ్రెండ్‌లు అవ్వాలనుకునే అబ్బాయిలకు తమ ఫోటోలు కూడా పంపిస్తామని వీరు అందులో రాసుకొచ్చారు.బాయ్‌ఫ్రెండ్‌కు 16-18 ఏళ్లు మాత్రమే ఉండాలని వారు ఒక రూల్ కూడా పెట్టారు.
ఈ లెటర్ రాసినప్పుడు వారిద్దరి వయసు 15 ఏళ్లు.ఈ లెటర్ లో వారు తమ అడ్రస్ కూడా రాశారు.
అయితే ఆ అడ్రస్ ను బట్టి జెన్నిఫర్‌ను కొందరు కనుగొన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఆమెకి ఇప్పుడు 71 సంవత్సరాలు ఉన్నాయని తెలుస్తోంది.
మరో అమ్మాయి జానెట్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నట్లు కొందరు కనిపెట్టారు.ఏదిఏమైనా 56 ఏళ్ల క్రితం బాయ్ ఫ్రెండ్ కోసం ఫారెన్ గర్ల్స్ ఎలాంటి ప్రయత్నాలు చేసే వారు తెలిసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.







