రణబీర్ అలియా జంటకు గోల్డెన్ బొకే అందించిన అభిమానులు.. ఫోటో వైరల్!

బాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉండి నేడు వివాహబంధంతో ఒకటి కాబోతున్నారు.ఈ క్రమంలోనే వీరి పెళ్లి వేడుకకు ఆర్ కె స్టూడియోస్ ఎంతో అందంగా ముస్తాబయింది.

 Fans Present Golden Bouquet To Ranbir Alia Photo Goes Viral , Alia Bhatt , Ranbi-TeluguStop.com

ఈ క్రమంలోనే పెద్దఎత్తున అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే వీరి వివాహ మహోత్సవానికి కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

ఇలా వీరిద్దరి పెళ్లి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుండగా సూరత్ కి చెందిన అభిమానులు ఈ జంటకు వినూత్నమైన కానుకను పంపించారు.

సూరత్ కి చెందిన ఇద్దరు బంగారు వ్యాపారవేత్తలు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పూత పూసిన 125 గులాబీలు ఒదిగి ఉన్న ఒక బోకేను ఈ జంటకు బహుమానంగా అందజేశారు.

ఇలా తమ అభిమాన హీరో హీరోయిన్ ల పెళ్లి వేడుకకు ఇలాంటి గిఫ్ట్ పంపించడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఆ బంగారపు బోకేకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Alia Bhatt, Bollywood, Fans Gift, Golden Bouquet, Marrige, Ranbir-Movie

ఇక ఇప్పటికే ఈ జంటకు పలువురు బాలీవుడ్ నిర్మాతలు స్టార్ సెలబ్రిటీలు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.బుధవారం ఫ్రీ వెడ్డింగ్, మెహందీ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ ప్రేమ జంటకు బిగ్ బీ, కరణ్ జోహార్ వంటి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న బ్రహ్మాస్త్ర టీమ్ వీరికి ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube