మార్కెట్లోకి ఒకేసారి 5 కొత్త ఫోన్లు వస్తున్నాయి.. ఓ లుక్కేయండి మరి!

ఈ స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్లు( Smart phones ) వాడనివారు దాదాపుగా వుండరనే చెప్పుకోవాలి.మరీ ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్లు అంటే పడిఛస్తారు.

 5 New Phones Are Coming To The Market At The Same Time Look , Market, Selling, S-TeluguStop.com

మార్కెట్లోకి ఎలాంటి మోడల్ కంపెనీ ఫోన్ వచ్చినా సరే వారి జేబులో వుండాల్సిందే.ఇక వాటి కోసం ఎంతైనా వెచ్చిస్తారు.

ఈ న్యూస్ అలాంటివారికోసమే.త్వరలో స్మార్ట్ మార్కెట్లోకి ఒకేసారి 5 కొత్త ఫోన్లు రాబోతున్నాయి.

ఇపుడు వాటిగురించి తెలుసుకుందాం.ఈ లిస్టులో మొదటిది “గూగుల్‌ పిక్సెల్‌ 8.”( Google Pixel 8 ) ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెల్ సిరీస్‌ ఫోన్‌లు ఈ అక్టోబర్ 4వ తేదీన అంటే ఏరోజే లాంచ్‌ కానున్నాయని మీకు తెలుసా? గూగుల్ పిక్సెల్‌ 8 ఫోన్‌ 6.70 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి వుండి 50 మెగా పిక్సెల్స్ తో రాబోతుంది.ఈ ఫోన్‌ రూ.58 వేల వరకు ఉండొచ్చని అంచనా.

Telugu Launch, Smart Phone, Ups-Latest News - Telugu

ఈ లిస్టులో రెండవది “గూగుల్ పిక్సెల్ 8 ప్రో.”( Google Pixel 8 Pro ) ఇక గూగుల్‌ పిక్సెల్ 8 ప్రో స్మార్ట్ ఫోన్‌ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌ డిస్‌ప్లే ఇవ్వనున్నారు.50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా కలిగి వుండి 11 ఎంపీ కెమెరాతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారు.ధర విషయానికొస్తే ఇది కూడా సుమారుగా యాభై వేలు వుంటుందని అంచనా.ఇక ఈ లిస్టులో మూడవ స్మార్ట్ ఫోన్ “శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ.”( Samsung Galaxy S23 FE ) ఇది కూడా ఇదే రోజు వస్తోంది.ఇది 6.4 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి వుండి, 50 మెగా పిక్సెల్స్ తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు.అలాగే ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వస్తోంది.

Telugu Launch, Smart Phone, Ups-Latest News - Telugu

ఇక ఈ లిస్టులో నాల్గవది “వివో వీ29.” ( Vivo V29 )ఇది కూడా ఇదే రోజు మార్కెట్లోకి వస్తోంది.ఈ 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్‌ ధర రూ.40వేలలోపు ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు.ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో ఈ ఫోన్‌ రానుంది.ఇక చివరగా “వివో వీ29 ప్రో”( Vivo V29 Pro ) గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి.ఈ ఫోన్‌ ధర రూ.44 వేల వరకు ఉండొచ్చని అంటున్నారు.ఇది 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube